ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పోలీసులకు పోస్టింగ్‌ కష్టాలు!

ABN, Publish Date - Sep 16 , 2024 | 03:13 AM

రాష్ట్ర పోలీసు శాఖలో సబ్‌ డివిజనల్‌ అధికారుల కొరత ఏర్పడింది. డీజీపీ కార్యాలయంలో 61 మంది డీఎస్పీలు నిరీక్షణలో ఉన్నా పలు జిల్లాల్లో సబ్‌ డివిజనల్‌ అధికారి పోస్టులు ఖాళీగానే ఉన్నాయి.

మాజీ సీఎం జగన్‌ సొంత జిల్లా కడపలో టీడీపీ మహిళా ఎమ్మెల్యేపై మాజీ ఉపముఖ్యమంత్రి అనుచరులు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ రెండు వర్గాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల నూజివీడులో రోడ్డుపైకి నీళ్లొచ్చి వాహనాలు చిక్కుకుంటే పరిస్థితిని చక్కదిద్దే పోలీసులే కరువయ్యారు. సబ్‌ డివిజనల్‌ అధికారి లేకపోవడమే దీనికి కారణం అంటున్నారు. రాష్ట్రంలో చాలా చోట్ల ఇలాంటి పరిస్థితి ఉన్నా డీజీపీ కళ్ల ముందే పదుల సంఖ్యలో డీఎస్పీలు పనిలేకుండా ఖాళీగా ఉండటం విశేషం.

61 మంది డీఎస్పీలు, 36 మంది ఏఎస్పీలు, 24 మంది ఐపీఎ్‌సలు వెయిటింగ్‌లోనే...

సబ్‌ డివిజనల్‌ అధికారులకు తీవ్ర కొరత

వడపోతలతో పోలీసు పెద్దలకు తలనొప్పి

జగన్‌కు వత్తాసు పలికిన ఖాకీలకు అందలం

పైరవీలతో పోస్టింగ్‌ సంపాదించిన కొందరు

ఆరోపణలు లేకున్నా బుక్కైన మరికొందరు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర పోలీసు శాఖలో సబ్‌ డివిజనల్‌ అధికారుల కొరత ఏర్పడింది. డీజీపీ కార్యాలయంలో 61 మంది డీఎస్పీలు నిరీక్షణలో ఉన్నా పలు జిల్లాల్లో సబ్‌ డివిజనల్‌ అధికారి పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. గత ప్రభుత్వంలో వైసీపీ నేతల కంటే దారుణంగా వ్యవహరించిన పలువురు ఐపీఎ్‌సలతో పాటు ఆరోపణలు ఎదుర్కొన్న కొందరు అధికారులు పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో హాజరు వేయించుకొంటున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఒక్క కానిస్టేబుల్‌ పోస్టు కూడా భర్తీ చేయకపోవడంతో పోలీసు సిబ్బంది సంఖ్య 50 వేలు మాత్రమే ఉంది. వీరితో పనిచేయించే బాధ్యత సబ్‌ డివిజన్‌ స్థాయిలో డీఎస్పీలు, జిల్లా స్థాయిలో ఎస్పీలు, ఆపై సీనియర్‌ ఐపీఎ్‌సలపై ఉంటుంది. వైసీపీ ప్రభుత్వ పాలనలో పోస్టింగ్స్‌ కోసం కొందరు.. ఒత్తిడితో మరికొందరు.. ఆ పార్టీ నేతల అన్యాయాలు, అక్రమాలకు వత్తాసు పలికారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రావడంతో గత ఐదేళ్లుగా ఐపీసీని పక్కనపెట్టి వైసీపీ చట్టం అమలు చేసిన పోలీసులకు కష్టాలొచ్చాయి.

అప్పుడలా చేసినందుకే..

టీడీపీ అధినేత చంద్రబాబును సొంత నియోజకవర్గంలోకి అనుమతించకుండా అడ్డుకున్న పోలీసు అధికారులు కొందరు.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి సైన్యంలా పనిచేసిన వారు ఇంకొందరు... పార్లమెంటు సభ్యుడిపై దేశద్రోహం కేసుపెట్టి థర్డ్‌ డిగ్రీ ప్రయోగించినవారు, యువగళం యాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించినవారు, రాజధాని రైతులపై ఉక్కుపాదం మోపినవారు.. ఇలా వైసీపీ ప్రభుత్వంలో లెక్కలేనన్ని అక్రమాలకు వంతపాడిన పోలీసులు ఇప్పుడు మథనపడుతున్నారు. ‘జగన్‌కు తిరుగుండదని భావించి తప్పుచేశాం.. వైసీపీ నాయకులు ఎన్ని తప్పులు చేసినా చోద్యం చూశాం. ప్రశ్నించిన గొంతుకల్ని బూటుకాలితో తొక్కేశాం.. ఇప్పుడు అనుభవిస్తున్నాం’ అని నిర్వేదంతో వ్యాఖ్యానిస్తున్నారు. అయితే కొందరు పోలీసులు తాము గత ప్రభుత్వంలో అన్యాయానికి గురయ్యామని చెప్పుకొని, పైరవీలు చేసుకుని పోస్టింగ్‌ తెచ్చుకున్నారు. మరికొందరు అక్రమాలకు తావివ్వకపోయినా ఆరోపణలతో అడ్డంగా బుక్కయ్యారు. దీంతో పలు సబ్‌డివిజన్లలో డీఎస్పీలు లేక పోలీసు ఉన్నతాధికారులు ఇబ్బంది పడుతున్నారు. విభజన తర్వాత రాష్ట్రానికి 144మంది ఐపీఎస్‌ అధికారులను కేటాయించగా కేంద్ర సర్వీసుల్లో 15మంది వరకూ ఉన్నారు. అయితే ఆ సంఖ్య సరిపోదని, 175కు పెంచాలని ఇటీవలే చంద్రబాబు ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ పరిస్థితుల్లో కూడా ఏకంగా 24 మంది ఐపీఎ్‌సలను ఖాళీగా కూర్చోబెట్టడం పోలీసువర్గాల్లో చర్చనీయాంశమైంది. వెయిటింగ్‌లో ఉన్న ఐపీఎ్‌సలు, అడిషనల్‌ ఎస్పీలు, డీఎస్పీల జాబితాను మరోమారు వడపోస్తే సగంమందికి పోస్టింగ్స్‌ ఇవ్వవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రాష్ట్రంలో 47 మంది డీఎస్పీల బదిలీ

22 సబ్‌ డివిజన్లకు కొత్త ఎస్‌డీపీవోలు

అమరావతి, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా 47 మంది డీఎస్పీలను పోలీసు శాఖ బదిలీ చేసింది. మొత్తం 22 సబ్‌ డివిజన్లతో పాటు ఏసీబీ, పీటీసీ, ఎస్‌బీ, రెడ్‌ శాండర్స్‌ లాంటి విభాగాల్లో పలవురు డీఎస్పీలను నియమించింది. కాశీబుగ్గ, చీపురుపల్లి, పాలకొండ, విశాఖ నార్త్‌, పెద్దాపురం, కొత్తపేట, తాడేపల్లిగూడెం, విజయవాడ నార్త్‌, సౌత్‌, వెస్ట్‌.. మైలవరం, ఈస్ట్‌ గుంటూరు, సత్తెనపల్లి, మార్కాపురం, కనిగిరి, కావలి, అనంతపురం రూరల్‌, చంద్రగిరి, రేణిగుంట, అనంతపురం, కదిరి, ఎమ్మిగనూరు సబ్‌ డివిజన్లకు లూప్‌లైన్లలో ఉన్న అధికారులను నియమించింది. దీంతోపాటు వెయిటింగ్‌లో ఉన్న 15మందికి పోస్టింగ్స్‌ ఇస్తూ తక్షణమే విధుల్లో చేరాలని డీజీపీ ద్వారకా తిరుమల రావు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.

వేధించిన వారికి అందలం

గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా పనిచేసిన ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడును శ్రీకాకుళం జిల్లాలో అరెస్టు చేసి జైలుకు పంపిన డీఎస్పీ ప్రస్తుతం అమలాపురం లాంటి కీలక సబ్‌ డివిజన్‌ దక్కించుకున్నారు. అంతకుముందు అచ్చెన్నను అరెస్టు చేసినందుకు ప్రతిఫలంగా వైసీపీ ప్రభుత్వం ఆయన్ను రామచంద్రాపురం డీఎస్పీగా నియమించింది.

టీడీపీ నాయకుడు, ప్రస్తుత స్పీకర్‌ అయ్యన్నపాత్రుడిని అరెస్టు చేసిన ఇద్దరు డీఎస్పీలు ఆయన దుస్తులు మార్చుకునే సమయంలో రహస్యంగా ఫొటో తీసి నాటి సీఎం జగన్‌కు పంపించారు. ఆయన్ను డ్రాయరుపై నిలబెట్టామని చెప్పుకొని మెప్పుపొందారు. తర్వాత వారిద్దరికీ కోరినచోట వైసీపీ ప్రభుత్వం పోస్టింగ్‌ ఇచ్చింది. అదే అధికారులకు టీడీపీ ప్రభుత్వం ఇటీవల ఏఎస్పీలుగా పదోన్నతి కల్పించింది.

ప్రకాశం జిల్లా దర్శిలో డీఎస్పీగా పనిచేసిన అధికారిని వంద మందిలో ఉన్నా జగన్‌ పేరు పెట్టి పిలిచి నేరుగా మాట్లాడేవారు. ఆయనకు సైతం పదోన్నతి కల్పించిన చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా 11మంది వీరభక్త వైసీపీ ఖాకీలను అందలం ఎక్కించింది.

మాజీ సీఎం పేషీలో కీలక ఐఏఎస్‌ అధికారి ధనుంజయ్‌రెడ్డి బంధువు, అనంతపురంలో వైసీపీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి గెలుపు కోసం ఏకపక్షంగా పనిచేసిన డీఎస్పీకి, వైసీపీ ప్రభుత్వంలో విజయనగరం, నర్సాపురం, నెల్లూరు వంటి కీలక సబ్‌ డివిజన్లు దక్కించుకున్న అధికారికి, గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడికి సహకారం అందించిన మరో డీఎస్పీకి ఏఎస్పీగా పదోన్నతి ఇవ్వడంతో పోలీసు శాఖ నిజంగా పనిచేస్తోందా? గందరగోళంలో ఉందా? అనే వ్యాఖ్యలు సహచర పోలీసుల్లోనే వినిపిస్తున్నాయి.’

Updated Date - Sep 16 , 2024 | 03:13 AM

Advertising
Advertising