ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మేట తొలగింపునకు రూ.100 కోట్లు

ABN, Publish Date - Nov 30 , 2024 | 01:30 AM

జిల్లాలోని పాలేరు, ముసి నదులు సముద్రంలో కలిసే ప్రాంతంలో భారీగా మేట వేసిన ఇసుకను తొలగిం చేందుకు చర్యలు తీసుకోవాలని ఏపీ మారిటైం బోర్డు చైర్మన్‌ దామచర్ల సత్యనారాయణ (సత్య) జిల్లా యంత్రాంగాన్ని కోరారు.

కలెక్టర్‌ అన్సారియా, అధికారులతో చర్చిస్తున్న సత్య

పాలేరు, ముసిల్లో పనులు

మారిటైం బోర్డుకు ప్రతిపాదనలు కోరిన చైర్మన్‌ దామచర్ల సత్య

పలు అంశాలపై కలెక్టర్‌, ఇతర అధికారులతో చర్చ

ఒంగోలు, నవంబరు, 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పాలేరు, ముసి నదులు సముద్రంలో కలిసే ప్రాంతంలో భారీగా మేట వేసిన ఇసుకను తొలగిం చేందుకు చర్యలు తీసుకోవాలని ఏపీ మారిటైం బోర్డు చైర్మన్‌ దామచర్ల సత్యనారాయణ (సత్య) జిల్లా యంత్రాంగాన్ని కోరారు. అందుకు అవసరమైన నిధుల కోసం ప్రతిపాదనలను మారిటైం బోర్డుకు పంపాలని సూచించారు. జిల్లాలో ఆక్వా సాగు, ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లు, ఫిషింగ్‌ హార్బర్‌ తదితర మారిటైం బోర్డు పరిధిలోని అంశాలతోపాటు పాలేరు, ముసి నదులలో ఇసుక మేటల తొలగింపు ప్రాధా న్యతలపై శుక్రవారం కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, మత్స్య శాఖ ఏడీ చంద్రశేఖ ర్‌రెడ్డి, ఇతర అధికారులతో కలిసి సత్య చర్చించారు. పాలేరు, ముసిలలో ఇసుక మేట లతో సముద్రం నీరు వాగులోకి ఎదురు రాక ఆ ప్రాంతంలోని ఆక్వా సాగుదారులు ఇబ్బందిపడుతున్నారన్నారు. ఎగువ నుంచి ప్రవాహం అధికంగా వచ్చినప్పుడు పరిసర ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయన్నారు. అందువల్ల ఇసుక మేటలు తొలగింపు అవసరాన్ని గుర్తించి ప్రతిపాదించాలని కోరారు. ప్రాఽథమికంగా ఇందుకోసం రూ.100 కోట్లు అవసరమయ్యే అవకాశం ఉందన్న విషయం చర్చ రాగా ఆ మేరకు మారిటైం బోర్డుకు ప్రతిపాదనలు పంపితే నిధుల కల్పనకు కృషిచేస్తామన్నారు. పాకలలో రూ.5కోట్లతో ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ ఏర్పా టుకు చర్యలపై మారిటైం బోర్డు చైర్మన్‌ సమీక్షించారు. కొత్తపట్నం సమీ పంలో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటిం చడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాగా జిల్లాలో ఆక్వాసాగు అభివృద్ధి తద్వారా ఉపాధి కల్పన అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ఆ రంగం మరింత పురోగతి సాధించేలా చర్యలు తీసుకోవాలని సూచించా రు. నాణ్యమైన పంట ఉత్పత్తులపై రైతులకు అవగాహన కల్పించాలని కోరారు.

Updated Date - Nov 30 , 2024 | 01:30 AM