104 ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి
ABN, Publish Date - Dec 02 , 2024 | 11:27 PM
104 అంబులెన్స్ సిబ్బంది సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంఎంయూ నాయకులు కోరారు. ఈమేరకు సోమవారం ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డిని ఆ సంఘం నాయకులు కలసి వినతిపత్రం అందజేశారు.
ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రకు వినతి
కనిగిరి, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : 104 అంబులెన్స్ సిబ్బంది సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంఎంయూ నాయకులు కోరారు. ఈమేరకు సోమవారం ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డిని ఆ సంఘం నాయకులు కలసి వినతిపత్రం అందజేశారు.
ఈసందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్ళు తమ స మస్యలను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చే శారు. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజలకు ఇబ్బందులు కల్గించకుండా విధులు నిర్వ హిస్తూనే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. సుప్రిం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. గత 16 సంవత్సరాలుగా చాలీచాలని జీతాలతో కుటుంబాలను పోషించుకోలేక ఇబ్బందులు పడుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు.
తమ డిమాండ్లను పరిష్కరించే విధంగా సీఎం దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేను కోరారు. ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర సానుకూలంగా స్పందించి ఉద్యోగుల సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంఎంయూ నాయకులు నాయబ్ రసూ ల్, సుధాకర్, నవీన్ పాల్గొన్నారు.
Updated Date - Dec 02 , 2024 | 11:27 PM