ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి

ABN, Publish Date - Nov 02 , 2024 | 12:34 AM

ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని పొట్టిశ్రీరాములు విగ్రహానికి వస్త్ర వ్యాపారులు పాలాభిషేకం చేశారు.

గిద్దలూరు, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి) : ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని పొట్టిశ్రీరాములు విగ్రహానికి వస్త్ర వ్యాపారులు పాలాభిషేకం చేశారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తెలుగు రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన పొట్టిశ్రీరాములు జీవితాన్ని నేటితరం రాజకీయ నాయకులు తెలుసుకోవాలని పలువురు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్లాత్‌మర్చెంట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ముప్పూరి శ్రీనివాసులు, కార్యదర్శి జిల్లెల్ల సంతప్‌కుమార్‌రెడ్డి, కోశాధికారి కె.శివ శంకర్‌, సంఘ ప్రతినిధులు అన్నా మురళి, ఐజి క్రిష్ణ, ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. కాగా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురష్కరించుకుని ఆవోపా అద్యక్షులు దారా రాములు ఆధ్వర్యంలో సంఘ ప్రతినిధులు అమరజీవి విగ్ర హానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించా రు. ఆవోపా, ఆర్యవైశ్య సంఘం, వాసవి క్లబ్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

మార్కాపురం : ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు శుక్రవారం పట్టణంలోని పలు కళాశాలలో ఘనంగా నిర్వహిం చారు. స్థానిక కిట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ముందుగా పొట్టి శ్రీరాములు చిత్రపటానికి కర స్పాండెంట్‌ అన్నా కృష్ణచైతన్య పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన త్యాగాలను కొనియాడారు. కార్యక్రమాల్లో కళాశాలల యాజమాన్యాలు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

గిద్దలూరు : రాచర్లలోని జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమరజీవి పొట్టిశ్రీరాములు, మహాత్మగాంధీ విగ్రహాలకు వాసవిక్లబ్‌ ప్రతినిధులు ఏర్పాటు చేసిన రేకులషెడ్‌ను ఎంఈవో వి.గిరిధరశర్మ ప్రారంభించారు. కార్యక్రమంలో దాత చక్కా రామాంజనేయులు, వాసవిక్లబ్‌ ప్రతినిధులు మాగులూరి శ్రీకాంత్‌, కందగట్ల వెంకటరమణ, ఆరవీటి చంద్రశేఖర్‌, పాఠశాల హెచ్‌ఎం రామానాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 02 , 2024 | 12:34 AM