మురిసిన పల్లె ముగిసిన పండుగ
ABN, Publish Date - Oct 20 , 2024 | 11:22 PM
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె పండుగ కార్యక్రమం జిల్లాలో వారంరోజులపాటు ఉత్సాహంగా సాగింది. ఆదివారంతో ముగిసింది. ఈవారం రోజులపాటు తెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నా కొనసాగించారు. జిల్లాకు చెందిన మంత్రి డాక్టర్ స్వామితో సహా అధికార టీడీపీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు తమ తమ ప్రాంతాల్లో పాల్గొన్నారు.
వారం రోజులు ఉత్సాహంగా కార్యక్రమం
గ్రామాల్లో అభివృద్ధి పనులకు భారీగా శంకుస్థాపనలు
మంత్రి స్వామితోసహా కీలక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం
జోరువానల్లోనూ పాల్గొన్న ప్రజానీకం
ఒంగోలు, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె పండుగ కార్యక్రమం జిల్లాలో వారంరోజులపాటు ఉత్సాహంగా సాగింది. ఆదివారంతో ముగిసింది. ఈవారం రోజులపాటు తెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నా కొనసాగించారు. జిల్లాకు చెందిన మంత్రి డాక్టర్ స్వామితో సహా అధికార టీడీపీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు తమ తమ ప్రాంతాల్లో పాల్గొన్నారు. గ్రామాల్లోని టీడీపీ శ్రేణులు, అధికారులు, సిబ్బంది మరింత ఉత్సాహంగా కార్యక్రమాలను నిర్వహించారు. ఉపాధి పథకం మెటీరియల్ నిధుల అనుసంధానంతో గ్రామాల్లో మౌలిక సదుపాయాలైన సిమెంట్ రోడ్లు, డ్రెయిన్‌లు, నీటి సంరక్షణ, ఇతరత్రా 30వేల పనులను సుమారు నాలుగున్నర వేల కోట్లతో ప్రభుత్వం పల్లెపండుగ కార్యక్రమంలో భాగంగా చేపట్టింది. ఇందుకోసం ఈనెల 14నుంచి 20 వరకు ఊరూరా శంకుస్థాపన కార్యక్రమాలను నిర్వహించి సంక్రాంతి నాటికి వాటిని పూర్తిచేయాలని నిర్దేశించింది. తదనుగుణంగా జిల్లాలో సుమారు రూ.126.19 కోట్లతో 1,168 పనులను కలెక్టర్ మంజూరు చేయగా వాటికి శంకుస్థాపనలు, భూమి పూజ చేశారు. ఈనెల 14నుంచి 20 వరకు జిల్లాలో సాగిన ఈ కార్యక్రమాన్ని మంత్రి డాక్టర్ డీఎ్‌సబీవి స్వామి తొలిరోజున కొండపి మండలం పెట్లూరులో లాంఛనంగా ప్రారంభించారు. ఇతర నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు ప్రారంభించారు.
జిల్లాలో ఈవారం రోజులపాటు తెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నా రోజుకు రెండు, మూడు గ్రామాల్లో ముఖ్యనేతలు స్వయంగా శంకుస్థాపనలు, భూమి పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈనెల 18న టీడీపీ రాష్ట్రస్థాయి వర్క్ షాపును అధినేత, సీఎం చంద్రబాబు నిర్వహించగా దానికి ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు హాజరయ్యారు. ఆ ఒక్క రోజు మినహా ఇతర ఆరు రోజులు ఆయా ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు ఒకట్రెండ్రోజులు ఒకరిద్దరు మినహా మిగతా వారు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలలకే గ్రామాల్లో అభివృద్ధి పనులకు స్వీకారం చుట్టడంతో ఆయా గ్రామాల్లో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా పాల్గొన్నాయి. అలా వారంపాటు సాగిన ఈ కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. చివరి రోజున కూడా వివిధ ప్రాంతాల్లో కీలక నేతలు పాల్గొన్నారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయ్‌కుమార్ నాగులుప్పలపాడు మండలంలోని నాగులప్పలపాడు, అమ్మనబ్రోలు, చవటపాలెం తదితర గ్రామాల్లో పాల్గొనగా స్థానికులు ఘన స్వాగతం పలికారు. బేస్తవారపేట మండలంలోని పలు గ్రామాల్లో గిద్దలూరు ఎమ్మెల్యే ఎం.అశోక్‌రెడ్డి పాల్గొన్నారు. త్రిపురాంతకం, పుల్లలచెరువు మండలాల్లోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు హాజరయ్యారు.
Updated Date - Oct 20 , 2024 | 11:22 PM