కలెక్టర్ దృష్టికి బైపాస్ రోడ్డు బాధితుల సమస్య
ABN, Publish Date - Jun 19 , 2024 | 11:01 PM
అభివృద్ధి పనుల్లో తనదైన మార్కును కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర చూపారు. బైపాస్ సమస్యకు శాశ్వత పరిష్కారానికి కృషి చేశారు. ఒంగోలులో బుధవారం జరిగిన జిల్లాసాఽ్థయి అధికారులతో సమావేశమైన ఎమ్మెల్యేలతో కలసి ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి కూడా పాల్గొన్నారు.
రూ 13.39కోట్లు విడుదలకు ఆయన సంతకం
తిరిగి ఉగ్ర హయాంలోనే పూర్తి కానున్న రోడ్డు
కనిగిరి, జూన్ 19 : అభివృద్ధి పనుల్లో తనదైన మార్కును కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర చూపారు. బైపాస్ సమస్యకు శాశ్వత పరిష్కారానికి కృషి చేశారు. ఒంగోలులో బుధవారం జరిగిన జిల్లాసాఽ్థయి అధికారులతో సమావేశమైన ఎమ్మెల్యేలతో కలసి ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి కూడా పాల్గొన్నారు. కనిగిరి ప్రాంతంలో నెలకొన్న ప్రధాన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు. అందులో భాగంగా దశాబ్దానికి ముందు డాక్టర్ ఉగ్ర ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో నగరంలో ట్రాఫిక్ దృష్ట్యా బైపాస్ నిర్మాణానికి పూనుకున్నారు. అందుకు భూమిని గుర్తించి ఆయా రైతులకు నష్టపరిహారం అందించాల్సి ఉంది. ఆ క్రమంలో 2014లో ఎన్నికలు వచ్చాయి. ఆ తర్వాత బైపాస్ బాధితులు నష్టపరిహారం చాలదంటూ న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఆ కేసులు తేలేటప్పటికీ ఆ తర్వాత 2019 ఎన్నికలు వచ్చాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బైపాస్ సమస్య మరుగున పడింది. తిరిగి 2024 ఎన్నికల్లో మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి హయాంలోనే బైపాస్ సమస్యకు పరిష్కారం లభించింది. బైపాస్ బాదితులకు నష్టపరిహారం విడుదల చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర కోరిందే తడవుగా జిల్లా కలెక్టర్ ఏఎస్ దినే్‌షకుమార్ రూ.13.39 కోట్లు విడుదల చేసేందుకు సంతకం చేశారు. త్వరలో బైపాస్ రోడ్డు నిర్మాణం కానుందని తెలిసి కనిగిరి ప్రాంత వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పాఠశాలలో నీటి వసతికి రూ.1.40 లక్షలు మంజూరు చేయించిన ఉగ్ర
వెలిగండ్ల, జూన్ 19 : ఎన్నికల్లో గెలుపొందిన వెంటనే ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహా రెడ్డి ఇచ్చిన మాటను నెరవేర్చారు. మండల పరిధిలో గోకులం పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల దాహార్తిని తీర్చేందుకు రూ.1.40 లక్షల నిధులు మంజూరు చేయించారు. ఈ నెల 15వ తేదీన వెలిగండ్ల మండలంలో సర్వసభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు పీవీన్ రవికుమార్ విద్యార్ధులకు మంచినీటి సౌకర్యం లేదని, మధ్యాహ్న భోజన సమయంలో ఇంటినుంచి నీటిని తెచ్చుకోవాల్సిన దుస్థితి ఉందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఎమ్మెల్యే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని చెప్పారు. ఈ మేరకు అధికారులు ఆ నిధులతో పాఠశాలలో బోరు ఏర్పాటుతోపాటు ట్యాంక్ నిర్మాణం చేపట్టనున్నారు. త్వరలో పనులు ప్రారంభంకానున్నాయి.
సరఫరాలో అవాంతరాలు లేకుండా చూడాలి
ఆర్‌డబ్యూఎస్ అధికారులతో ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర
కనిగిరి, జూన్ 19 : కనిగిరి ప్రాంతానికి సరఫరా జరిగే మంచినీటి సరఫరాలో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడాలని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో చెప్పారు. పొదిలి రోడ్డులోని కనిగిరి మంచినీటి పైపులను బుధవారం ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా అధికారులను పిలిపించి కనిగిరి ప్రాంతానికి ఎంత నీరు సరఫరా జరుగుతుందో తెలుసుకున్నారు. పెరిగిన జనాభాను దృష్టిలో ఉంచుకుని మంచినీటిని అందించాలని సూచించారు. అదేవిధంగా పైపుల లీకులను గుర్తించి శాశ్వత పరిష్కారం చేయాలన్నారు. కనిగిరి ప్రాంతంలో ఇంటింటికీ తాగునీటి కుళాయిల ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే వెంట ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు, సిబ్బంది ఉన్నారు.
Updated Date - Jun 19 , 2024 | 11:02 PM