ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అవినీతి అధికారిపై వేటు

ABN, Publish Date - Nov 13 , 2024 | 01:18 AM

జిల్లా పంచాయతీ కార్యాలయం పరిధిలో పనిచేసే ఉద్యోగుల బదిలీల్లో అవినీతి, అక్రమాలకు పాల్పడిన పూర్వపు ఇన్‌చార్జి డీపీవో ఉషారాణిపై వేటుపడింది. ప్రస్తుతం ఒంగోలు డీఎల్‌డీవోగా ఉన్న ఆమెను బాధ్యతల నుంచి తొలగిస్తూ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు.

డీఎల్‌డీవో బాధ్యతల నుంచి ఉషారాణి తొలగింపు

కలెక్టర్‌ అన్సారియా ఉత్తర్వులు

ఒంగోలు కలెక్టరేట్‌, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి) : జిల్లా పంచాయతీ కార్యాలయం పరిధిలో పనిచేసే ఉద్యోగుల బదిలీల్లో అవినీతి, అక్రమాలకు పాల్పడిన పూర్వపు ఇన్‌చార్జి డీపీవో ఉషారాణిపై వేటుపడింది. ప్రస్తుతం ఒంగోలు డీఎల్‌డీవోగా ఉన్న ఆమెను బాధ్యతల నుంచి తొలగిస్తూ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. జిల్లా పంచాయతీ పరిధిలో పనిచేసే గ్రేడ్‌-5,6 (సచివాలయ) ఉద్యోగుల బదిలీల్లో తిర‘కాసు’ చోటుచేసుకుంది. ప్రభుత్వ మార్గదర్శకాలకు భిన్నంగా, కలెక్టర్‌ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌కు వ్యతిరేకంగా అప్పుడు ఇన్‌చార్జి డీపీవోగా ఉన్న ఉషారాణి బదిలీలు చేశారు. దీని వెనుక పెద్దఎత్తున నగదు చేతులు మారినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈనేపథ్యంలో బదిలీల్లో అవినీతి, అక్రమాలపై ‘ఆంధ్రజ్యోతి’లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. స్పందించిన కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా సమగ్ర విచారణకు ఆదేశించారు. ఫారెస్టు సెటిల్మెంట్‌ అధికారి లోకేశ్వరరావు నేతృత్వంలో త్రిసభ్య కమిటీని నియమించారు. బదిలీల్లో అనేక అంశాలు వెలుగు చూశాయి. బదిలీల ఆర్డర్లు ఇచ్చేందుకు తన కార్యాలయ ఉద్యోగులను పావుగా వాడుకొని వారి ద్వారా డబ్బులు వసూలు చేసినట్లు తేలింది. సచివాలయాల తనిఖీకి వెళ్లిన సమయంలో అక్కడ ఉద్యోగుల పట్ల దురుసుగా ప్రవర్తించడంతోపాటు వారిని మానసికంగా దెబ్బతీసే విధంగా వ్యవహరించినట్లు త్రిసభ్య కమిటీ విచారణలో బయటపడింది. ఆమేరకు నివేదికను విచారణాధికారి అయిన లోకేశ్వరరావు 15 రోజుల క్రితం కలెక్టర్‌కు సమర్పించారు. దాన్ని ఆమె పరిశీలించి పంచాయతీరాజ్‌ కమిషనర్‌కు పంపారు. ఉషారాణి వ్యవహరించిన తీరుతో 56 మంది ఉద్యోగులకు పోస్టింగ్‌లు లేక గాలిలో ఉండాల్సిన విషయాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పీఆర్‌ కమిషనర్‌ ఆదేశాల మేరకు ఉషారాణిని ఒంగోలు డీఎల్‌డీవో బాధ్యతల నుంచి తప్పిస్తూ మంగళవారం కలెక్టర్‌ ఉత్తర్వులు ఇచ్చారు.

Updated Date - Nov 13 , 2024 | 01:19 AM