ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వ్యవసాయ మార్కెట్లను వికేంద్రీకరించాలి

ABN, Publish Date - Jun 23 , 2024 | 11:04 PM

రాష్ట్ర వ్యవసాయ, సహకార మార్కెటింగ్‌, పశుసంవర్ధక డెయిరీ డెవల్‌పమెంట్‌, మత్స్యశాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడును పర్చూరు శాసన సభ్యులు ఏలూరి సాంబశివరావు ఆదివారం మర్యాదపూర్వకంగా విజయవాడ మంత్రి స్వగృహంలో కలిసి పలు అంశాలపై చర్చించారు. వ్యవసాయ అభివృద్ధికి విశేష కృషిచేయాలని కోరారు. వ్యవసాయ మార్కెట్‌లను వికేంద్రీకరించాలన్నారు.

మంత్రి అచ్చెన్నాయుడును కలసిన ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

పర్చూరు, జూన్‌ 23: రాష్ట్ర వ్యవసాయ, సహకార మార్కెటింగ్‌, పశుసంవర్ధక డెయిరీ డెవల్‌పమెంట్‌, మత్స్యశాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడును పర్చూరు శాసన సభ్యులు ఏలూరి సాంబశివరావు ఆదివారం మర్యాదపూర్వకంగా విజయవాడ మంత్రి స్వగృహంలో కలిసి పలు అంశాలపై చర్చించారు. వ్యవసాయ అభివృద్ధికి విశేష కృషిచేయాలని కోరారు. వ్యవసాయ మార్కెట్‌లను వికేంద్రీకరించాలన్నారు. పర్చూరు నియోజకవర్గంలో ప్రస్తుతం వ్యవసాయ మార్కెట్‌ ఉందని , నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం అని అన్నారు. ఉన్న ఆరు మండలాలు సుదూరప్రాంతాలుగా విస్తరించి ఉన్నాయన్నారు. మార్టూరు, యద్దనపూడి మండలాలకు మార్టూరు మార్కెటింగ్‌ యార్డు, పర్చూరు, కారంచేడు మండలాలకు పర్చూరు మార్కెటింగ్‌ యార్డు, ఇంకొల్లు, చిన్నగంజాం మండలాలకు చిన్నగంజాం మార్కెట్‌ యార్డులుగా ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు. రైతాంగానికి అండగా నిలవాలని, అన్నదాతల అభున్నతికి కృషిచేయాలని ఈసందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్‌, మాజీ ఎంపీ గల్లా జయదేవ్‌, టీడీపీ నాయకులు కోడెల శివరాం తదితరులు ఉన్నారు.

Updated Date - Jun 23 , 2024 | 11:04 PM

Advertising
Advertising