ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

3 క్వింటాళ్ల కర్పూరంతో అఖండజ్యోతి

ABN, Publish Date - Nov 29 , 2024 | 11:33 PM

ఓం నమశ్శివాయ, శంభోశంకర, హరహర మహాదేవ శంభోశంకర అంటూ భక్తుల నినాదాలతో శుక్రవారం రాత్రి జాతీయరహదారి పక్కన శ్రీదుర్గామల్లీశ్వరి దేవస్థానం ప్రాంగణం మారుమోగింది.

దేవస్థానం ఆవరణలో వెలిగించిన అఖండ కర్పూరజ్యోతి

శివనామస్మరణతో మారుమోగిన దుర్గామల్లీశ్వరి దేవస్థానం ప్రాంగణం

భక్తులు భారీగా రాక

మార్టూరు, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి) : ఓం నమశ్శివాయ, శంభోశంకర, హరహర మహాదేవ శంభోశంకర అంటూ భక్తుల నినాదాలతో శుక్రవారం రాత్రి జాతీయరహదారి పక్కన శ్రీదుర్గామల్లీశ్వరి దేవస్థానం ప్రాంగణం మారుమోగింది. కార్తీకమాసంలో ఏటా ఈ దేవస్థానంలో భారీగా కర్పూరంతో భక్తులు అఖండ కర్పూరజ్యోతిని వెలిగిస్తారు. అఖండ కర్పూరజ్యోతిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. అందులో భాగంగా శుక్రవారం రాత్రి గ్రానైట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పత్తిపాటి సురేష్‌ ఆధ్వర్యంలో 3 క్వింటాళ్లు కర్పూరంతో అఖండ కర్పూరజ్యోతిని వెలిగించారు. ఈ కార్యక్రమానికి తొలుత బెంగళూరు నుంచి ప్రత్యేకంగా తెప్పించిన 2 క్వింటాళ్లు బంతి, చామంతి, మల్లి, లిల్లీ తదితర పూలతో దేవస్థానం ప్రాంగణంలో స్వామి రూపాలను, వేంకటేశ్వరస్వామి శంకుచక్రం రూపంలో అందంగా అలంకరించారు. అదేవిధంగా దేవస్థానంలో స్వామిని, అమ్మ వారిని ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం వెలిగించిన అఖండ కర్పూరజ్యోతిని భక్తులు తనవితీరా దర్శించుకొని నమస్కారాలు చేసుకున్నారు. ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సీఐ శేషగిరిరావు బందోబస్తు ఏర్పాటుచేశారు. అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. మాలధారులకు భిక్షను ఏర్పాటుచేశారు.

Updated Date - Nov 29 , 2024 | 11:33 PM