మోకాళ్లపై శింగరకొండ మెట్లు ఎక్కిన వృద్ధుడు
ABN, Publish Date - Jun 11 , 2024 | 11:22 PM
డీపీ అధికారంలోకి రావడం, అద్దంకి నియోజకవర్గం నుంచి మరోసారి గొట్టిపాటి రవికుమార్ విజయం సాధించడంతో అద్దంకి ప ట్టణం నర్రావారిపాలెంకు చెందిన టీడీపీ నేత నర్రా కాంతయ్య మంగళవారం శింగరకొండలో కొండపైకి మెట్ల మార్గంలో మోకాళ్లపై ఎక్కి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని మొక్కు తీర్చుకున్నారు.
టీడీపీ విజయంతో తీర్చుకున్న మొక్కు
అద్దంకి, జూన్ 11 : టీడీపీ అధికారంలోకి రావడం, అద్దంకి నియోజకవర్గం నుంచి మరోసారి గొట్టిపాటి రవికుమార్ విజయం సాధించడంతో అద్దంకి ప ట్టణం నర్రావారిపాలెంకు చెందిన టీడీపీ నేత నర్రా కాంతయ్య మంగళవారం శింగరకొండలో కొండపైకి మెట్ల మార్గంలో మోకాళ్లపై ఎక్కి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని మొక్కు తీర్చుకున్నారు. 67 సంవత్సరాల వయస్సులో కాం తయ్య మోకాళ్లపై ఎక్కడం ఆశ్చర్యానికి గురిచేసింది. లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం చైర్మన్ నర్రావుల కొండలు, టీడీపీ అద్దంకి పట్టణ పార్టీ అధ్యక్షుడు చిన్ని శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ మన్నెం ఏడుకొండలు, కుందారపు రామారావు, మాదాల రామాంజనేయులు, నర్రా శ్రీనివాసరావు, గుంజి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Updated Date - Jun 11 , 2024 | 11:22 PM