ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సుపరిపాలనకు ఏపీ ప్రజల తీర్పు

ABN, Publish Date - Sep 21 , 2024 | 12:55 AM

మంచి పాలనకు ఏపీ ప్రజలు ఓటు ద్వారా స్పష్టమైన తీర్పు ఇచ్చారని ఎంఎల్‌సీ అశోక్‌బాబు పేర్కొ న్నారు.

పెద్దదోర్నాల, సెప్టెంబరు 20 : మంచి పాలనకు ఏపీ ప్రజలు ఓటు ద్వారా స్పష్టమైన తీర్పు ఇచ్చారని ఎంఎల్‌సీ అశోక్‌బాబు పేర్కొ న్నారు. స్థానిక పంచాయతీ కార్యాలయం ఆవరణలో ప్రభుత్వం ఏర్పడి వంద రోజులను పురస్కరించుకొని ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని మెజార్టీని కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చారన్నారు. వారి స్ఫూర్తితో చంద్రబాబునాయుడు అహర్నిశలు కృషి చేస్త్తున్నారన్నారు. సంక్షేమం, అభివృద్ధి వేగంగా చేస్తూ వంద రోజుల పాలనలోనే ప్రజల మన్నన పొందడం కూటమి ప్రభుత్వం ఘనత అన్నారు. గత ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెట్టిందని, ఎన్నో కష్టాలు, నష్టాలు ఎదుర్కొని ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే పింఛన్లు పెంచి ఇంటింటికీ వెళ్లి అందిస్తున్నట్లు తెలి పారు. ఒకటవ తేదీనే ఉద్యోగులకు జీతా లు ఇవ్వడం, నిరుద్యోగులకు మెగా డీఎస్సీ 16 వేలకు పైగా టీచర్‌ పోస్టులు భర్తీచేయనున్నట్లు ప్రకటించారన్నారు. ఎర్రగొండపాలెం ఇన్‌చార్జ్‌ గూడూరి ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ ముఖ్య మంత్రిగా నారా చంద్రబాబునాయుడు అధికా రం చేపట్టిన కొద్దిరోజులకే నియోజకవర్గం అభివృద్ధిలో భాగంగా సిమెంటు రోడ్ల నిర్మాణాని కి మండలానికి రూ.5కోట్లు చొప్పున రూ.15 కోట్లు మంజూరు చేశారన్నారు. అదేవిధంగా ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కళాశాల విద్యార్ధుల కోసం హాస్టల్‌ మంజూరు చేయనున్నట్లు తెలి పారు. కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఎనుముల నాగేశ్వరరావు, మండల ప్రత్యేక అధికారి జగన్నాథరావు, ఎంపీడీవో నాసర్‌రెడ్డి, తహసీల్దారు శాంతి, ఎంఈవో మస్తాన్‌ నాయక్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ భ్రమ రాంభికాదేవి, ఏవో జవహర్‌లాల్‌ నాయక్‌, ఈవో మోహన్‌రావు, ఆయా శాఖాధికారులు, టీడీపీ నాయకులు షేక్‌ మాబు, దొడ్డా శేషాద్రి, ఈదర మల్లయ్య, చంటి, దేసు నాగేంద్ర బాబు, షేక్‌ సమ్మద్‌ భాష, ఇస్మాయిల్‌, భాష, జనసేన మండల అధ్యక్షులు కేతి మురళీ, బీజేపీ మండల అధ్యక్షులు గండి వీరారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Sep 21 , 2024 | 12:55 AM