గొడవ పడొద్దన్నందుకు దాడి
ABN, Publish Date - Nov 04 , 2024 | 01:31 AM
అర్ధరాత్రి సమయంలో కొంతమంది గొడవ పడుతుండగా అడ్డు తీసే ప్రయత్నం చేసిన అ య్పప్ప మాలధారిపై దాడి చేశారు. ఈ సంఘటన ఒంగోలు నగరం లాయర్‌పేటలోని సెంట్రల్కేఫ్ వద్ద శనివారం అర్ధరాత్రి 12 గంటలకు జరిగింది.
ఒంగోలు క్రైం, నవంబరు3(ఆంధ్రజ్యోతి): అర్ధరాత్రి సమయంలో కొంతమంది గొడవ పడుతుండగా అడ్డు తీసే ప్రయత్నం చేసిన అ య్పప్ప మాలధారిపై దాడి చేశారు. ఈ సంఘటన ఒంగోలు నగరం లాయర్‌పేటలోని సెంట్రల్కేఫ్ వద్ద శనివారం అర్ధరాత్రి 12 గంటలకు జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల మేరకు.. స్థానిక సీవిఎన్ రూం ఎదురుగా ఉన్న ద్వారకనగర్‌లో నివాసం ఉంటున్న రావులపల్లి ప్రేమ్ కుమార్ అయప్పస్వామి మాల ధరించి ఉన్నాడు. ఆయన బండ్లమిట్ట వెళ్లి మోటర్‌సైకిల్‌పై తిరిగి ఇంటికి వెళుతున్నాడు. అయితే సెంట్రల్కేఫ్ వద్ద కొంత మంది గొడవ పడుతున్నారు. దీంతో ప్రేమ్‌కుమార్ వెళ్ళి వారిని నిలువరించే ప్రయత్నం చేశాడు. దీంతో వారు నీవెవరూ మా మధ్యలో అంటూ దుర్భాషలాడి కర్రలతో దాడి చేశారు. బాధితుడు తన సోదరుడికి ఫోన్ చేసి పిలిపించుకొని స్థానిక రిమ్స్‌లో చేరాడు. అక్కడ ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేస్తున్నారు.
Updated Date - Nov 04 , 2024 | 01:31 AM