ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బాలినేని అక్రమాలపై విచారణ చేయాలి

ABN, Publish Date - Jun 24 , 2024 | 01:44 AM

గత ఐదు సంవ త్సరాలలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన అవినీతి, అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరి పించాలని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి డిమాండ్‌ చేశారు.

జనచైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి

ఒంగోలు(కల్చరల్‌), జూన్‌ 23: గత ఐదు సంవ త్సరాలలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన అవినీతి, అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరి పించాలని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి డిమాండ్‌ చేశారు. ఆదివారం ఒంగోలులోని రంగాభవన్‌లో ఏర్పాటు చేసిన విలే కరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాలి నేని అనుచరులు భూకబ్జాలు చేస్తూ దొంగ రిజి స్ర్టేషన్లతో నగరంలో అనేక భూములు ఆక్రమించా రని ఆరోపించారు. బాలినేని శ్రీనివాసరెడ్డి బంఽ దువు నిర్మిస్తున్న విల్లాల లెవలింగ్‌ కోసం అక్ర మంగా కోట్లాది రూపాయల గ్రావెల్‌ తరలించటం, వాగుపోరంబోకును కలుపుకోవటంపై దర్యాప్తు జరపాలన్నారు. బాలినేని పేకాట, బెట్టింగ్‌ వంటి వ్యసనాలకు లోనై ఒంగోలు అభివృద్ధిని గాలికి వదిలేశారని విమర్శించారు. 80శాతం పూర్తయిన టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు ఇవ్వలేదని, నగరానికి దూరంగా 450 ఎకరాలు మార్కెట్‌ ధర కన్నా రె ట్టింపు ధరతో కొనుగోలు చేశారని, అందులో రూ. 50 కోట్ల దోపిడీ జరిగిందని లక్ష్మణరెడ్డి చెప్పారు. సుపరిపాలన ఉపాధ్యక్షుడు డాక్టర్‌ కంచర్ల సుబ్బా రావు మాట్లాడుతూ కందుకూరు నియోజకవర్గా న్ని ప్రకాశం జిల్లాలో కలుపుతామని ఎన్నికల ము ందు చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీని నిలబె ట్టుకోవాలన్నారు. ఒంగోలు సిటిజన్‌ ఫోరం అధ్యక్షు డు కొల్లా మధు మాట్లాడుతూ మార్కాపురంను ప్రత్యేక జిల్లాగా చేయాలని, ఒంగోలు నగరంలో మాస్టర్‌ ప్లాన్‌ను కచ్చితంగా అమలు చేయాలని కోరారు. రిటైర్డ్‌ పోలీసు అధికారి సుంకర సాయి బాబు మాట్లాడుతూ జిల్లాలో సైనిక్‌ స్కూలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రముఖ న్యాయవాది ఎ న్‌.దేవకుమారి మాట్లాడుతూ ఒంగోలు కా ర్పొరేషన్‌ నగర ప్రజలకు కనీస సౌకర్యాలు కూడా కల్పించటం లేదని, అధిక పన్నులు వసూలు చే స్తున్నారని ఆరోపించారు. అనంతరం నగర అభి వృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ల సుబ్బారావు మా ట్లాడుతూ జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి జరి గితేనే ద్వారానే వలసలు ఆగుతాయని చెప్పారు. అయితే దీనిని గత పాలకులు నిర్లక్ష్యం చేశారని ఆ యన విమర్శించారు.

Updated Date - Jun 24 , 2024 | 01:44 AM

Advertising
Advertising