ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మర్రిపూడిలో బీసీ బాలుర హాస్టల్‌

ABN, Publish Date - Nov 05 , 2024 | 11:57 PM

మర్రిపూడిలో బీసీ బాలుర వసతి గృహం ఏర్పాటుకావాలన్న గ్రామస్థుల చిరకాల కోరిక ఎట్టకేలకు నెరవేరింది. రాష్ట్ర మంత్రి, స్థానిక శాసనసభ్యుడు అయిన డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి చొరవతో ప్రభుత్వం హాస్టల్‌ను మంజూరు చేసింది.

మంజూరు చేస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు

ఫలించిన మంత్రి స్వామి చొరవ

మర్రిపూడి, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రమైన మర్రిపూడిలో బీసీ బాలుర వసతి గృహం ఏర్పాటుకావాలన్న గ్రామస్థుల చిరకాల కోరిక ఎట్టకేలకు నెరవేరింది. రాష్ట్ర మంత్రి, స్థానిక శాసనసభ్యుడు అయిన డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి చొరవతో ప్రభుత్వం హాస్టల్‌ను మంజూరు చేసింది. కొండపిలో మూసివేసిన బీసీ బాలుర వసతి గృహాన్ని మర్రిపూడికి మారుస్తూ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా ఉత్తర్వులు ఇచ్చారు. పొదిలి బీసీ బాలికల హాస్టల్‌ సంక్షేమ అధికారికి తాత్కాలికంగా ఇక్కడి వసతి గృహం బాధ్యతలు అప్పగించారు. మర్రిపూడిలో బీసీ బాలుర వసతి గృహం ఏర్పాటు చేయాలని గ్రామస్థులు చాలాకాలంగా కోరుతున్నారు. ఇదే విషయాన్ని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యా కమిటీ చైర్మన్‌ ఉప్పు సాయిబాబు ఇటీవల మంత్రి స్వామి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన మంత్రి వసతి గృహం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు సూచించారు. అనంతరం జిల్లా బీసీ సంక్షేమ సహాయాధికారి శ్రీనివాసరావు క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. మర్రిపూడిలో హాస్టల్‌ ఏర్పాటు చేస్తే ఆ గ్రామంతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లోని 244 మంది విద్యార్థులకు ఉపయోగపడుతుందని ఆయన ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఈనేపథ్యంలో మర్రిపూడికి బాలుర వసతి గృహం మంజూరు చేస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు ఇచ్చారు. వసతి గృహానికి అవసరమైన అద్దె భవనాలను పరిశీలించేందుకు రెండురోజుల్లో జిల్లా అధికారులు రానున్నారు. ఈ సందర్భంగా మర్రిపూడి మండల ప్రజలు మంత్రి స్వామికి కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Nov 05 , 2024 | 11:57 PM