ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వంతెన నిర్మించి అప్రోచ్‌రోడ్డు వదిలేసి!

ABN, Publish Date - Oct 21 , 2024 | 11:57 PM

మండలంలోని వెల్లంపల్లి సమీపంలో గుండ్లకమ్మ నదిపై వంతెన నిర్మాణం పూర్తయ్యింది.

త్రిపురాంతకం, అక్టోబరు 21 ( ఆంధ్రజ్యోతి ) : మండలంలోని వెల్లంపల్లి సమీపంలో గుండ్లకమ్మ నదిపై వంతెన నిర్మాణం పూర్తయ్యింది. అయితే ఆ వంతెనకు అనుసందానంగా అప్రోచ్‌ రోడ్డు ( వంతెన నుంచి ప్రధాన రహదారికి) ఏర్పాటు చేయలేదు. దీంతో ప్రజలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. 2007లో అప్పటి దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి చొరవతో వంతెన నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. నిర్మాణంలో భాగంగా 12 పిల్లర్లకు గాను నాలుగు పిల్లర్లను నిర్మించిన గుత్తేదారు ఖర్చులు పెరిగిపోవడంతో చేతులెత్తేశారు. అప్పటి నుంచి సుమారు 9 ఏళ్లపాటు దీని పనులు కొనసాగక పోవడంతో టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రి శిద్దా రాఘవరావు అధనపు నిదులు మంజూరు చేయించారు. 2016 ఆగస్టులో పనులను పునఃప్రారభించారు. అయితే 247 మీటర్ల బ్రిడ్జి నిర్మాణం, 400 మీటర్ల సీసీ రోడ్డు పూర్తయ్యాయి. 2019 మార్చి 9న వంతెనను ప్రారంభించారు. కానీ వంతెనకు ఇరువైపులా అప్రోచ్‌ రోడ్డు మాత్రం నిర్మించలేదు. అప్రోచ్‌ రోడ్డు నిర్మించేందుకు రెండు వైపులాభూమి కోసం ప్రయత్నాలు చేసినా భూ యజమానుల నుండి అంగీకారం రాలేదు. దీంతో నిర్మాణం నిలిచింది. ఇక వంతెనకు సైడ్‌ వాల్స్‌ కూడా పూర్తి చేయలేదు. దీంతో ద్విచక్రవాహనాలు మాత్రమే వెళ్లేందుకు తాత్కాలిక ఏర్పాటు చేశారు. తప్పనిసరి పరిస్థితులలో ద్విచక్ర వాహనదారులు మాత్రం వంతెనపై అలానే ప్రయాణిస్తున్నారు. ట్రాక్టర్లు, కార్లు, లారీలు, ఆటోలు మాత్రం పాడుపడిపోయిన పాత చప్టాపై నుంచే వెళుతున్నాయి. నేలచప్టానే ఉండడం తో వర్షాకాలంలో సాగర్‌ కాలువకు నీరు విడుదలైనపుడు గుండ్లకమ్మ ఉదృతంగా ప్రవహించి చప్టాపై నుంచి నీరు పారుతుంది. దీనికితోడు పెద్దపెద్ద గుంతలు ఏర్పడి వాహనాలు రాకపోకలకు ఇబ్బందిగా మారింది. వంతెన పనులు మొత్తం పూర్తయితే ఎర్రగొండపాలెం, మార్కాపురం, దర్శి నియోజకవర్గాల్లోని అనేక గ్రామాల వారికి రాకపోకలకు ఇబ్బందులు తొలగుతాయి. త్రిపురాంతకం, ఎర్రగొండపాలెం మండలాల్లోనివారు కురిచేడు, దొనకొండ, దర్శి, ముండ్లమూరు, ఒంగోలు ప్రాంతాలకు వెళ్లెందుకు, ఒంగోలు, దర్శి, పొదిలి ప్రాంతాలవారు హైదరాబాద్‌ వెళ్ళేందుకు సుమారు 50 కిలోమీటర్ల దూరం తగ్గు తుంది. దీనికి తోడు చందవరం వద్ద ప్రముఖ బౌద్ద క్షేత్రం, దొనకొండ వద్ద విమానాశ్రయం, పారిశ్రామిక కారిడార్‌లను ఏర్పాటు చేసే పరిస్థితి ఉన్నందున ఈ వంతెన నిర్మాణం ఎంతో ఉపయోగకరం. కూటమి ప్రభుత్వం ఈ వంతెనను పూర్తిస్థాయిలో వినియోగం లోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - Oct 21 , 2024 | 11:57 PM