ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మిరపకు స్వస్తి .. పొగాకుపై ఆసక్తి

ABN, Publish Date - Nov 11 , 2024 | 12:29 AM

మండలంలో బర్లీ పొగాకు సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. మిరప సాగు తగ్గడం, రైతులు విస్తారంగా పొగాకు సాగుకు సన్నద్ధం కావడంతో పొగ నారుకు మార్కెట్లో గిరాకీ పెరిగింది. గత ఏడాది బర్లీ పొగాకు సాగు చేసిన రైతాంగం మంచి లాభాలు గడించడంతో అధిక శాతం రైతులు పొగాకు సాగుకు మొగ్గుచూపుతున్నారు.

చందలూరు పొలంలో పొగ మొక్కలు నాటుతున్న కూలీలు

మండలంలో పెరిగిన బర్లీ సాగు

నష్టాలతో రూటు మార్చిన రైతులు

పంగులూరు, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి) : మండలంలో బర్లీ పొగాకు సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. మిరప సాగు తగ్గడం, రైతులు విస్తారంగా పొగాకు సాగుకు సన్నద్ధం కావడంతో పొగ నారుకు మార్కెట్లో గిరాకీ పెరిగింది. గత ఏడాది బర్లీ పొగాకు సాగు చేసిన రైతాంగం మంచి లాభాలు గడించడంతో అధిక శాతం రైతులు పొగాకు సాగుకు మొగ్గుచూపుతున్నారు. గత ఏడాది వెయ్యి నుంచి 1100ల ఎకరాలలో సాగయిన పొగాకు ఈ ఏడాది నాలుగు వేల ఎకరాలలో పొగాకు సాగయ్యే పరిస్థితి కనిపిస్తుంది. మిరప సాగులో పడిన కష్టాలు, చవి చూసిన నష్టాలతో రైతులు మిరప మంగళం పాడారు.

గత ఏడాది షుమారు రెండు వేల ఎకరాలలో మిరప సాగు చేసిన రైతాంగం ఈ ఏడాది 300 ఎకరాలకు పరిమితమయ్యారు. మిరపసాగులో పెరిగిన పెట్టుబడి, పురుగు, తెగుళ్ళ బెడదతో ఆశించిన దిగుబడులు రాని పరిస్దితితో పాటు మార్కెట్లో దిగజారిన ధరలతో మిరప సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టాలు చవిచూశారు.. పొగాకు సాగులో పంట నష్ట పోయే పరిస్థితి ఉండదని, సాగు చేసిన 60 రోజుల కాలవ్యవధిలో చేతికొచ్చిన పొగాకు అమ్మకాలతో రైతుకు కలిగే పెట్టుబడి ఎసులుబాటు, మార్కెట్లో పొగాకుకు ఉన్న గిరాకీతో రైతులు పొగాకు సాగుకు మొగ్గు చూపుతున్నారు. మండలంలో గత ఏడాది చందలూరులో 800 ఎకరాలలో మిరప సాగు చేసిన రైతులు ఈ ఏడాది 100 ఎకరాలకు పరిమతం కాగా, కొప్పెరపాడులో 300 నుంచి 50 ఎకరాలకు, నూజెళ్లపళ్లిలో 600 నుంచి 350 ఎకరాలకు, బూదవాడలో 450 నుంచి 100 ఎకరాలకు మిరప సాగు తగ్గడం జరిగిందని ఏవో సుబ్బారెడ్డి తెలిపారు.. పొగాకు కొనుగోలు చేసే కంపెనీలు తెల్ల బర్లీ సాగు చేయాలనే సూచన చేస్తున్నప్పటికీ గత ఏడాది తెల్ల బర్లీ, నల్ల బర్లీ కొనుగోలులో వ్యత్యాసం లేక పోవడంతో దిగుబడి అధికంగా ఉండే నల్ల బర్లీ వైపు రైతాంగం మొగ్గు చూపుతున్నారు. మండల కేంద్రమైన పంగులూరు, చందలూరు, నూజెళ్లపళ్లి, కొప్పెరపాడు, బూదవాడ పరిసర గ్రామాలలో పొగాకు సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని వ్యవసాయాధికారి సుబ్బారెడ్డి తెలిపారు.

సాగు విస్తీర్ణం పెరగడంతో నారుకు పెరిగిన గిరాకీ

బర్లీ పొగాకు సాగు విస్తీర్ణం పెరగడంతో మార్కెట్లో పొగ నారుకు గిరాకీ పెరిగింది. సాగు పెరగడంతో పాటు ముందుగా వేసిన పొలాలలో అధిక వర్షాలకు నాటిన పొగ మొక్కలు దెబ్బతినడంతో పొగనారుకు గిరాకీ పెరిగింది. పంగులూరులో పొగనారుకు గిరాకీ ఉంటుందని భావించిన పలువురు రైతులు బోర్ల కింద పొగనారును విస్తారంగా సాగు చేశారు. పొగనాట్లు ముమ్మరం కావడంతో రైతులు నారుకోసం పొగ నారుమళ్ల వైపు పరుగులు పెడుతున్నారు.

Updated Date - Nov 11 , 2024 | 12:29 AM