ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మెప్మాలో బోగస్‌లకు చెక్‌..!

ABN, Publish Date - Nov 24 , 2024 | 12:16 AM

మెప్మాలో బోగస్‌ గ్రూపులు, అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు కూటమి ప్రభుత్వం సరికొత్త విధానాన్ని అమలు చేస్తోంది. ప్రతి సభ్యురాలికీ ప్రభుత్వ పథకాలు అందాలన్న లక్ష్యంతో ముందడుగు వేస్తోంది. అందుకోసం ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. అందులో గ్రూపు సభ్యుల వివరాలన్నీ పొందుపరచాలని ఆదేశించింది. దీంతో అధికారులు ఆ పనిలో నిమగ్నమయ్యారు. గత వైసీపీ పాలనలో ఒంగోలులో కొందరు ఆర్పీలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు.

పొదుపు సభ్యులకు యాప్‌పై అవగాహన కల్పిస్తున్న అధికారులు (ఫైల్‌)

ఆర్పీలకు నమోదు బాధ్యతలు

ప్రతి మహిళకు పథకాలు

చేర్చడమే లక్ష్యం

ఒంగోలు, కార్పొరేషన్‌, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి) : మెప్మాలో బోగస్‌ గ్రూపులు, అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు కూటమి ప్రభుత్వం సరికొత్త విధానాన్ని అమలు చేస్తోంది. ప్రతి సభ్యురాలికీ ప్రభుత్వ పథకాలు అందాలన్న లక్ష్యంతో ముందడుగు వేస్తోంది. అందుకోసం ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. అందులో గ్రూపు సభ్యుల వివరాలన్నీ పొందుపరచాలని ఆదేశించింది. దీంతో అధికారులు ఆ పనిలో నిమగ్నమయ్యారు. గత వైసీపీ పాలనలో ఒంగోలులో కొందరు ఆర్పీలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. నకిలీ గ్రూపులను సృష్టించారు. వాటి ద్వారా బ్యాంకులను బురిడీ కొట్టించి రూ.కోట్లలో రుణాలు దోచుకున్నారు. ఈ బాగోతాన్ని ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తెచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని పట్టణ పొదుపు సంఽఘాల్లో ఈ తరహా వ్యవహారాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో కూటమి ప్రభుత్వం సరికొత్త విధానం అమలుకు శ్రీకారం చుట్టింది. ఎస్‌హెచ్‌జీ ప్రొఫైల్‌ పేరుతో తీసుకొస్తున్న ఈ యాప్‌పై ఇప్పటికే సిబ్బందికి శిక్షణ కూడా పూర్తయ్యింది. ఈ విధానం వలన ఆయా సంఘాల్లో సభ్యులంతా ఉన్నారా? లేదా? అన్న విషయం తేటతెల్లమవుతుంది. అలాగే ఒకే సభ్యురాలు రెండు సంఘాల్లో ఉంటే వెంటనే గుర్తించవచ్చు. కొన్ని సంఘాల్లో సభ్యులు ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాల్లో ఉంటుండగా వారి పేర్లతో ఇంకొందరు ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు పొందుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వేర్వేరు గ్రూపుల్లో సభ్యులతో నకిలీ సంఘాలను ఏర్పాటు చేసి రుణాలు పొందారు. ప్రత్యేక యాప్‌తో ఇలాంటి అక్రమాలకు తెరపడనుంది.

పొదుపు మహిళలకు మరింత లబ్ధి

స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇకపై ఎస్‌హెచ్‌జీ ప్రొఫైలింగ్‌ యాప్‌ను ప్రామాణికంగా తీసుకొని పథకాలను అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తం సభ్యుల్లో ఎంతమందిప్రభుత్వ పథకాలు పొందుతున్నారు, ఎంతమందికి అందడం లేదు, ఇప్పటి వరకు లబ్ధి పొందిన వారి వివరాలను ప్రస్తుతం ఆర్పీ (రిసోర్స్‌ పర్సన్‌)లు సేకరించి ఆన్‌లైన్‌ చేస్తున్నారు. జిల్లాలోని ఒంగోలు నగరంతోపాటు అన్ని మునిసిపాలిటీలలో 9,545 పొదుపు సంఘాలు ఉన్నాయి. వాటిలో 93,228 లక్షల మంది సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం పది మంది సభ్యులతో సంఘంగా ఏర్పడి పొదుపు చేయడంతోపాటు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని స్వయం ఉపాధిని పొందుతున్నారు. సభ్యుల్లో ఎవరైనా చనిపోయినా, వలస వెళ్లినా, వయసు మీరినా, వారి స్థానంలో కొత్తవారిని నియమించుకుంటున్నారు. ఆయా సంఘాల సభ్యుల వివరాలను ఇప్పటి వరకు ఆన్‌లైన్‌ చేయకపోవడంతో ప్రభుత్వ పథకాలను పొందలేకపోతున్నారు. కాగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్‌ సిక్స్‌ పథకాలు అమలుకు ఉపక్రమించింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక యాప్‌లో పొదుపు మహిళల వివరాలు నమోదు చేయడం ద్వారా ఇప్పటి వరకూ ప్రభుత్వ పథకాలకు దూరంగా ఉంటున్న వారికి లబ్ధి చేకూరనుంది.

అర్హులకు పథకాలు అందించేందుకే యాప్‌

టి.రవికుమార్‌, మెప్మా పీడి

మహిళల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలను పొదుపు సంఘాలకు చేరువచేయాలన్నదే ప్రభుత్వం ఉద్దేశం. యాప్‌లో వివరాలు నమోదు చేయడం వలన పొదుపు మహిళలకు మరింత లబ్ధి చేకూరుతుంది. సభ్యులు తయారు చేసే ఉత్పత్తుల ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌కు అనుసంధానం చేయడం జరుగుతుంది. యాప్‌లో వివరాలు నమోదు చేయడం ద్వారా బోగస్‌ గ్రూపులకు చెక్‌పడుతుంది.

Updated Date - Nov 24 , 2024 | 12:16 AM