మూతపడ్డ వాటర్ ప్లాంట్
ABN, Publish Date - Nov 07 , 2024 | 11:19 PM
తర్లుపాడులో గ్రామీణ నీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో నిర్మించిన వాటర్‌ప్లాంట్ మూడు రోజుల క్రితం మూతపడింది.
తర్లుపాడు, నవంబరు 7 ఆంధ్రజ్యోతి: తర్లుపాడులో గ్రామీణ నీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో నిర్మించిన వాటర్‌ప్లాంట్ మూడు రోజుల క్రితం మూతపడింది. ఈ వాటర్ ప్లాంట్ నుంచి తర్లుపాడులోని ప్రజలు బబులు రూ.5 చొప్పున కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. అయితే దీనికి విద్యుత్ సరఫరా మూడు రోజుల క్రితం విద్యుత్ శాఖ అధికారులు కట్ చేశారు. వాటర్ ప్లాంట్ బిల్లు కట్టకపోవడంతోనే విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు విద్యుత్‌శాఖ ఏఈ హనుమా నాయక్ తెలిపారు. తర్లుపాడు గ్రామ అధికారులు విద్యుత్ శాఖకు చెల్లించాల్సిన బిల్లులు చెల్లించి వాటర్ ప్లాంట్ పునరుద్ధరించి తర్లుపాడు ప్రజల దాహార్తి తీర్చాలని కోరుతున్నారు. అనుమతులు లేని వాటర్ ప్లాంట్ వద్ద బబుల్ రూ.10 చొప్పున కొనుగోలు చేసి తాగాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.
Updated Date - Nov 07 , 2024 | 11:19 PM