సంగమేశ్వరం ప్రాజెక్టును పరిశీలించిన కలెక్టర్
ABN, Publish Date - Nov 16 , 2024 | 01:23 AM
మండలంలోని చెన్నిపాడు వద్ద అర్ధంతరంగా ఆగిపోయిన సంగమేశ్వరం ప్రాజెక్టును కలెక్టర్ తమీమ్ అన్సారియా శుక్రవారం పరిశీలించారు. ప్రాజెక్టు పూర్తి వివరాలను డీఈ కరీముల్లాను అడిగి తెలుసుకున్నారు.
డీఈని అడిగి వివరాలు తెలుసుకున్న అన్సారియా
పొన్నలూరు, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని చెన్నిపాడు వద్ద అర్ధంతరంగా ఆగిపోయిన సంగమేశ్వరం ప్రాజెక్టును కలెక్టర్ తమీమ్ అన్సారియా శుక్రవారం పరిశీలించారు. ప్రాజెక్టు పూర్తి వివరాలను డీఈ కరీముల్లాను అడిగి తెలుసుకున్నారు. నీటి నిల్వ, ప్రవాహం, కుడి, ఎడమ కాల్వలు, ముంపుప్రాంతం తదితర అంశాలను ఆయన క్షుణ్ణంగా వివరించారు. ఈసందర్భంగా ప్రాజెక్టు ప్రయోజనాలను పలువురు రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఆమె వెంట తహసీల్దార్ పుల్లారావు, ఎంపీడీవో సుజాత, టీడీపీ మండల అధ్యక్షుడు అనుమోలు సాంబశివరావు, నాయకులు మండవ ప్రసాద్, కర్ణా కోటిరెడ్డి, మండవ మురళి, తానికొండ మహేంద్ర తదితరులు ఉన్నారు.
Updated Date - Nov 16 , 2024 | 01:23 AM