నెరవేరనున్న దర్శి ప్రజల చిరకాలవాంఛ
ABN, Publish Date - Nov 11 , 2024 | 12:13 AM
దర్శి ప్రాంత ప్రజల చిరకాలవాంఛను టీటీడీ కల్యాణ మండపం నిర్మాణం ద్వారా నెరవేరుస్తున్నట్టు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు. దర్శి పట్టణంలోని తూ ర్పుగంగవరం రోడ్డులో రూ.2కోట్లతో నిర్మించతల పెట్టిన కల్యాణ మండపానికి ఆదివారం ఎంపీ మా గుంట, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపా టి లక్ష్మి, డాక్టర్ లలిత్‌సాగర్ దంపతులు భూమిపూ జ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
ఎంపీ మాగుంట
టీటీడీ కల్యాణ మండపం నిర్మాణానికి భూమిపూజ
దర్శి, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): దర్శి ప్రాంత ప్రజల చిరకాలవాంఛను టీటీడీ కల్యాణ మండపం నిర్మాణం ద్వారా నెరవేరుస్తున్నట్టు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు. దర్శి పట్టణంలోని తూ ర్పుగంగవరం రోడ్డులో రూ.2కోట్లతో నిర్మించతల పెట్టిన కల్యాణ మండపానికి ఆదివారం ఎంపీ మా గుంట, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపా టి లక్ష్మి, డాక్టర్ లలిత్‌సాగర్ దంపతులు భూమిపూ జ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా మాగుంట మాట్లాడుతూ దర్శిలో కల్యాణ మండపం నిర్మించాలన్న ప్రతిపాదన గత 40 సంవ త్సరాలుగా కొనసాగుతుందన్నారు. డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ ఎంపీ మాగుంట సహకారంతో కల్యా ణ మండపం పనులు ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, కౌన్సిలర్ వీసీ రెడ్డి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు యాదగిరి వాసు, కె.చంద్రశేఖర్, దారం సుబ్బారావు, బొ ట్ల కోటేశ్వ రరావు, పుల్లలచెరువు చిన్నా, కల్లూరి సుబ్బు, కార్యదర్శి గుర్రం బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
వచ్చే సంక్రాంతికి దర్శికి రైళ్లు నడుపుతాం
దర్శి, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): వచ్చే సంక్రాంతికి దర్శికి రైళ్లు నడిచే విధంగా చర్యలు తీసుకుంటామని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి స్పష్టం చేశారు. దర్శి- తూర్పుగంగవరం రోడ్డులో నూతనంగా నిర్మిస్తున్న రైల్వే స్టేషన్, రైల్వేలైన్ నిర్మాణ పనులను ఆదివారం ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చా ర్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ లలిత్‌సాగర్ పరిశీలిం చారు. ఈసందర్భంగా వారు రైల్వే అధికారులతో నిర్మా ణ పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నా రు. ఈసందర్భంగా మాగుంట మాట్లాడుతూ దర్శి ప్రాం త ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నడికుడి- శ్రీకాళహస్తి రైల్వే లైన్ నిర్మాణం పూర్తయి రైల్లో ప్రయా ణించే అవకాశం కలుగుతుందన్నారు.
కార్యక్రమంలో కమిషనర్ వై.మహేశ్వ రరావు, టీడీపీ కూటమి నాయకులు పాల్గొన్నారు.
పెండింగ్ పనులు పూర్తి చేస్తాం
దర్శి నియోజకవర్గంలో నిలిచిపోయిన పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు కృషి చేస్తామని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి స్పష్టం చేశారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశలో ఆయన మాట్లాడారు. జాతీయ స్థాయి డ్రైవింగ్ శిక్షణ పరిశోధనా స్థానం నిర్మాణ పనులు త్వరలో పునఃప్రారంభమ య్యేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పునాదుల్లో నిలచిపోయిన కోల్డ్ స్టోరేజీ, ఆడిటోరియం పనులు పూర్తి చేయించటంతో పాటు క్రీడాప్రాంగణం ఏర్పాటకు నిధులు విడుదల చేయిస్తామన్నారు. అ ధ్వానంగా మారిన ఎన్‌ఏపీ రక్షిత మంచినీటి పథకం అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయిస్తామ న్నారు.
డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఎంపీ మాగుంట సహకారంతో దర్శి నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తామని చెప్పారు.
Updated Date - Nov 11 , 2024 | 12:13 AM