సాగునీటి వనరుల అభివృద్ధికి చేయూతనివ్వాలి
ABN, Publish Date - Nov 13 , 2024 | 12:18 AM
చీరాల నియోజకవర్గ పరిధిలో ఉన్న సాగునీటి వనరుల అభివృద్ధికి చే యూతను ఇవ్వాలని నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మ ల రామానాయుడుకు ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య విజ్ఞప్తి చేశా రు. మంగళవారం మంత్రి చాంబర్లో ఆయనను ఎమ్మె ల్యే కొండయ్య కలిశారు.
మంత్రికి ఎమ్మెల్యే కొండయ్య విజ్ఞప్తి
చీరాల, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి) : చీరాల నియోజకవర్గ పరిధిలో ఉన్న సాగునీటి వనరుల అభివృద్ధికి చే యూతను ఇవ్వాలని నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మ ల రామానాయుడుకు ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య విజ్ఞప్తి చేశా రు. మంగళవారం మంత్రి చాంబర్లో ఆయనను ఎమ్మె ల్యే కొండయ్య కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో ఉన్న కొమ్మమూరు కాలువ, ఎత్తిపోతల పథకాలు, వాటి పనితీరు, వాటి అభివృద్ధికి అందించాల్సిన చేయూత తదితర అంశాలను ఎమ్మెల్యే కొండయ్య మంత్రికి వివరించారు. రైతుల ప్రయోజనాలతో పాటు తాగునీటి సమస్య పరిష్కారానికి ఉన్న అనుకూల పరిస్థితులను ఎమ్మెల్యే ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై మంత్రి నిమ్మల సానుకూలంగా స్పందించారు.
Updated Date - Nov 13 , 2024 | 12:18 AM