ప్రేక్షకులను ఆకట్టుకున్న నాటిక ప్రదర్శనలు
ABN, Publish Date - May 27 , 2024 | 11:02 PM
శ్రీకారం స్వచ్ఛంద సేవా సంస్థ రోటరీ కళా పరిషత్ ఆధ్వర్యంలో 14వ తెలుగు రాష్ట్రాల నాటికల పోటీలు సోమవారం రాత్రి మార్టూరులో మద్ది సత్యనారాయణ కంపెనీ ఆవరణలో ప్రారంభించారు. వాటిలో మొదటగా శ్రీ అమృత లహరి ఆర్ట్స్ విజయవాడ వారు ప్రదర్శించిన నాన్నా నే నొచ్చేస్తా నాటిక అందరినీ ఆకట్టుకున్నది. భార్యాభర్తల మధ్య బంధం కలకాలం నిలబడాలనే దృక్పథంతో నాటిక ప్రదర్శన సాగింది.
మార్టూరు, మే 27 : శ్రీకారం స్వచ్ఛంద సేవా సంస్థ రోటరీ కళా పరిషత్ ఆధ్వర్యంలో 14వ తెలుగు రాష్ట్రాల నాటికల పోటీలు సోమవారం రాత్రి మార్టూరులో మద్ది సత్యనారాయణ కంపెనీ ఆవరణలో ప్రారంభించారు. వాటిలో మొదటగా శ్రీ అమృత లహరి ఆర్ట్స్ విజయవాడ వారు ప్రదర్శించిన నాన్నా నే నొచ్చేస్తా నాటిక అందరినీ ఆకట్టుకున్నది. భార్యాభర్తల మధ్య బంధం కలకాలం నిలబడాలనే దృక్పథంతో నాటిక ప్రదర్శన సాగింది. వివాహ జీవితంలో భార్యాభర్తల మధ్య ఏర్పడ్డ స్పర్ధలను వారు సరిదిద్దుకోలేక పోతున్నారు. పెళ్లంటే సర్దు బాటు సంసారం అంటే దిద్దుబాటు అన్న సూత్రాన్ని భార్యా భర్తలు అర్థం చేసుకోలేకపోతున్నారన్నదే నాటిక ఇతివృత్తం. అనంతరం తెలుగు కళా సమితి విశాఖ వారిచే నిశ్శబ్దమా నీ ఖరీదెంత..? నాటికను ప్రదర్శించారు. అక్రమ సంబంధాలు కారణంగా కుటుంబాల మధ్య ఏర్పడుతున్న అగాధాలులో మహిళలు చట్టాలను దుర్వినియోగ పరచుకోవడం, తద్వారా కుటుంబాలు నాశన మవుతున్నాయని సమాజంలో కొన్ని చోట్ల జరుగుతున్న సంఘటనలను ఇతివృత్తంగా నాటిక ప్రదర్శన జరిగింది. అయితే ఈ విషయంపై మేధావులు మౌనంగా ఉండడం జాతికే ప్రమాదం అంటూ మేధావులు ఆలో చించాలంటూ నాటిక ప్రదర్శన జరిగింది. తరువాత కళా నికేతన్ వీరన్న పాలెం వారిచే రాజుగారి గోచి నాటిక ప్రదర్శన చేశారు. ఈ నాటికలో ప్రధానంగా నేర విచారణ నేరస్తుడికి శిక్ష కంటే కూడా నేరం వల్ల అనాథలైన బాఽధితుల్ని ఆదుకోవడమే ముఖ్యమని చెప్పడమే లక్ష్యంగా నాటిక సాగింది. సమాజంలో జరుగుతున్న పలు ఉదంతాలు ఈ నాటికలోని సన్నివేశాలు ద్వారా మనకు కళ్లకు కట్టినట్లుగా కనిపించాయని ప్రేక్షకుల ఆలోచనలు సాగాయి.
నేడు ప్రదర్శించనున్న నాటికలు
మంగళవారం రాత్రి శ్రీకారం రోటరీ కళాపరిషత్ వారిచే రైతు భారతం నాటికను తొలుత ప్రదర్శిస్తారు. అనంతరం రసఝరి పొన్నూరు వారిచే కాపలా నాటిక తరువాత కళాంజలి హైదరాబాద్ వారిచే రైతే రాజు నాటిక, చివరగా మైత్రి కళా నిలయం వారిచే విజయవాడ వారిచే బంధం నాటికను ప్రదర్శిస్తారు.
Updated Date - May 27 , 2024 | 11:02 PM