పోర్టులు, హార్బర్ల అభివృద్ధికి కృషి
ABN, Publish Date - Sep 30 , 2024 | 11:28 PM
రాష్ట్రంలో పోర్టులు, హార్బర్ల అభివృద్ధికి కృషి చేస్తానని మారిటైం బోర్డు చైర్మన్‌గా నియమితులైన దామచర్ల సత్య తెలిపారు. సోమవారం సాయంత్రం స్థానిక మండల పరిషత్ అతిథి గృహంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఒంగోలు, చీరాల వాడరేవు వద్ద ఫిషింగ్ హార్బర్లు
మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య
కొండపి, సెప్టెంబరు 30 : రాష్ట్రంలో పోర్టులు, హార్బర్ల అభివృద్ధికి కృషి చేస్తానని మారిటైం బోర్డు చైర్మన్‌గా నియమితులైన దామచర్ల సత్య తెలిపారు. సోమవారం సాయంత్రం స్థానిక మండల పరిషత్ అతిథి గృహంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలోని పోర్టులతోపాటు నిజాంపట్నం, జువ్వలేరు ఫిషింగ్ హార్బర్లు పూర్తి చేస్తామన్నారు. వీటికితోడు ఒంగోలు, చీరాల వాడరేవు ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటుకు కృషి చేస్తానని సత్య తెలిపారు. 5వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు మంగళగిరిలోని బోర్డు కార్యాలయంలో తాను బాధ్యతలు స్వీకరిస్తానని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సత్య కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన్ను సన్మానించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు చాగంరెడ్డి నరసారెడ్డి, తిప్పారెడ్డి కృష్ణారెడ్డి, మారెడ్డి సుబ్బారెడ్డి, కూనంనేని రమేష్, కందిమళ్ల రమేష్, పోటు శ్రీనివాసరావు, ఆర్యవైశ్య సంఘం నాయకుడు పాదర్థి సుధాకర్ పాల్గొన్నారు. జరుగుమల్లి మండలం కామేపల్లిలోని పోలేరమ్మ ఆలయం, పొన్నలూరు మండలంలోని సంగమేశ్వరస్వామి ఆలయంలో సత్య ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట టీడీపీ నాయకులు ఉన్నారు.
సత్యకు సన్మానం
టంగుటూరు : మారిటైం బోర్డు చైర్మన్‌గా నియమితులైన సత్యను ఒంగోలు యోగా మిత్ర మండలి సన్మానించింది. వల్లూరు సమీపంలోని హైవేస్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సత్య మాట్లాడుతూ వచ్చే ఐదేళ్లలో రామాయపట్నం పోర్టును పూర్తి చేస్తామన్నారు. యోగా మిత్రమండలి సభ్యుడు తాతా ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శిద్దా సూర్యప్రకాష్, హర్షిణి కళాశాల కరస్పాండెంట్ గోరంట్ల రవికుమార్, అంజిరెడ్డి, ఆంజనేయులు, చక్రపాణి, శేషాంబరి పాల్గొన్నారు.
Updated Date - Sep 30 , 2024 | 11:28 PM