ఉద్యోగులకు జీతాలు పడ్డాయ్
ABN, Publish Date - Sep 03 , 2024 | 01:09 AM
ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పడ్డాయి. 1వ తేదీ ఆదివారం కావడంతో సోమవారం ఉదయం నుంచి ఉద్యోగులకు వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలు భారీవర్షాలతో అతలాకుతలమైనా ప్రభుత్వం ఆ ఎఫెక్ట్‌ను జీతాలపై పడనీయలేదు.
విజయవాడలో ఇబ్బందికర పరిస్థితులున్నా వేతనాలు
ఒంగోలు (కలెక్టరేట్), సెప్టెంబరు 2 : ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పడ్డాయి. 1వ తేదీ ఆదివారం కావడంతో సోమవారం ఉదయం నుంచి ఉద్యోగులకు వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలు భారీవర్షాలతో అతలాకుతలమైనా ప్రభుత్వం ఆ ఎఫెక్ట్‌ను జీతాలపై పడనీయలేదు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఉద్యోగులకు చెప్పిన విధంగా వారి వేతనాలు వారి అకౌంట్లలో జమ చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. జిల్లావ్యాప్తంగా 50శాతానికిపైగా ఉద్యోగులు తమ జీతాలను అందుకున్నారు. మిగిలిన వారికి మంగళ, బుధవారాల్లో జమయ్యే అవకాశం ఉంది. మరోవైపు రిటైర్డ్ ఉద్యోగులకు కూడా వారి పెన్షన్లు బ్యాంకు అకౌంట్లలో జమయ్యాయి. గత వైసీపీ ప్రభుత్వంలో జీతాలు రాక రోజులు తరబడి ఎదురుచూసే ఉద్యోగులకు మూడు నెలల నుంచి క్రమంతప్పకుండా 1, 2 తేదీల్లోనే జీతాలు పడుతున్నాయి.
Updated Date - Sep 03 , 2024 | 07:48 AM