ఉపాధిలో అంతులేని అవినీతి
ABN, Publish Date - Nov 05 , 2024 | 11:44 PM
మండలంలో ఏడాది కాలంలో జరిగిన ఉపా ధి పనుల్లో సుమారు రూ.5 కోట్ల మేర నిధులు గోల్ మాల్ జరిగినట్లు డ్వామా అధికారులు తెలిపారు. రూ.9 కోట్ల మేర పనులు జరగగా, అందులో రూ.4 కోట్ల 66 లక్షల రికవరీకి ఆదేశించినట్లు డ్వామా పీ డీ జోసఫ్‌కుమార్ తెలిపారు. మంగళవారం స్థానిక ఉపాధి కార్యాలయంలో 16వ విడత సామాజిక తని ఖీ ప్రజావేదిక నిర్వహించారు.
రూ.5 కోట్ల నిధులు గోల్‌మాల్
రికవరి చేయాలని పీడీ ఆదేశాలు
సీఎస్‌పురం(పామూరు), నవంబరు 5 (ఆంధ్ర జ్యోతి): మండలంలో ఏడాది కాలంలో జరిగిన ఉపా ధి పనుల్లో సుమారు రూ.5 కోట్ల మేర నిధులు గోల్ మాల్ జరిగినట్లు డ్వామా అధికారులు తెలిపారు. రూ.9 కోట్ల మేర పనులు జరగగా, అందులో రూ.4 కోట్ల 66 లక్షల రికవరీకి ఆదేశించినట్లు డ్వామా పీ డీ జోసఫ్‌కుమార్ తెలిపారు. మంగళవారం స్థానిక ఉపాధి కార్యాలయంలో 16వ విడత సామాజిక తని ఖీ ప్రజావేదిక నిర్వహించారు. మండలంలో 23 గ్రా మ పంచాయతీలకు సంబంధించిన పనుల వివరాల ను డీఆర్పీలు చదివి వినిపించారు. పనులకు రానివా రికి సైతం దొంగ మస్టర్లు వేసి బిల్లులు డ్రా చేశారని, సంతకాలు ఒకరే చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కొన్ని గ్రామాల్లో అవేన్యూ ప్లాంటేషన్ కింద మొక్కలు నాటకుండనే నిదులు డ్రా చేసుకున్నట్లు గుర్తించారు.
సీఎస్‌పురం పంచాయతీలో రూ.72 లక్షల 90 వేలు, ఉప్పలపాడు పంచాయతిలో రూ.46 లక్షలు, పులుగోరుపల్లెలో రూ.45 లక్షలు, అరివేముల పంచా యతీలో రూ.38 లక్షలు, గోగులపల్లిలో రూ.29 లక్షలు, చింతపూడు పంచాయతిలో రూ.24 లక్షలు, చెర్లోపల్లిలో రూ.21 లక్షలతో పాటు ఇతర పంచాయతీల్లో కూడా నిధులు గోల్‌మాల్ జరిగినట్టు డ్వామా అధికారులు గుర్తించారు.
ఈసందర్భంగా పీడీ జోసఫ్‌కుమార్ మాట్లాడుతూ ఉపాధి పనుల్లో పెద్దఎ త్తున నిధులు పక్కదారి పట్టాయని చెప్పారు. అవినీతికి పాల్పడిన వారిపై చర్యలకు ఆదేశిస్తున్నట్లు తెలిపారు. టె క్నికల్ అసిస్టెంట్లు కొలతలు చూపించక పోవడం దారుణమన్నారు. బాధ్యుల నుంచి రికవరీ చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా విజెలెన్స్ అధికారి ఝాన్సీరాణి, ఏపీడీలు రారావు, వెంకటస్వామి, జిల్లా విజిలెన్స్ ఎగ్జిక్యూటీవ్ సురేష్‌కుమార్, వెంక టేశ్వరరావు, ఏపీవో వాక్యవతి, తదితరులు పాల్గొ న్నారు.
Updated Date - Nov 05 , 2024 | 11:44 PM