ప్రతి అర్జీని సకాలంలో పరిష్కరించాలి
ABN, Publish Date - Oct 22 , 2024 | 12:43 AM
మీకోసంలో వచ్చిన ప్రతి అర్జీని సీరియ్‌సగా పరిగణనలోకి తీసుకొని సకాలంలో సహేతుకంగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లోని మీ కోసం హాలులో సోమవారం జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణతో కలిసి ప్రజలనుంచి ఆర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మీ కోసం కార్యక్రమాన్ని ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
మీకోసంలో కలెక్టర్ తమీమ్ అన్సారియా
ఒంగోలు కలెక్టరేట్, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి) : మీకోసంలో వచ్చిన ప్రతి అర్జీని సీరియ్‌సగా పరిగణనలోకి తీసుకొని సకాలంలో సహేతుకంగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లోని మీ కోసం హాలులో సోమవారం జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణతో కలిసి ప్రజలనుంచి ఆర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మీ కోసం కార్యక్రమాన్ని ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. జిల్లాలో అర్జీలను పరిష్కరిస్తున్న తీరును ముఖ్యమంత్రి కార్యాలయంనుంచి అధికారులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. మొక్కుబడి సమాధానాలతో అర్జీదారులకు ఎండార్స్‌మెంట్ ఇచ్చేసి సమస్యను పరిష్కరించినట్లుగా రికార్డులలో చూపితే సహించేది లేదని హెచ్చరించారు. క్షేత్ర స్థాయిలో సమస్య పరిష్కారం కావాల్సిందేనని స్పష్టం చేశారు. ఆ సమస్య పరిష్కరించలేని పక్షంలో అందుకు కారణాలను కూడా అర్జీదారులకు వివరించాలని సూచించారు. మీ కోసం కార్యక్రమానికి అధికారులు సమయపాలన పాటించాలన్నారు. ప్రతి సోమవారం ఉదయం 9.55 గంటలకల్లా అధికారులందరూ హాజరుకావాలని ఆదేశించారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. సుమారు 249 అర్జీలు అధికారులకు అందాయి. ఈ కార్యక్రమంలో డీఆర్వో ఆర్. శ్రీలత, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మాధురి, ఝాన్సీలక్ష్మితో పాటు పలు శాఖల అధికారులు ఉన్నారు.
Updated Date - Oct 22 , 2024 | 12:43 AM