అంతా ఫ్రీ హోల్డ్!
ABN, Publish Date - Oct 09 , 2024 | 11:42 PM
గత వైసీపీ సర్కారు తీసుకొచ్చిన ‘ఫ్రీ హోల్డ్’ చట్టం అక్రమార్కులకు వరంగా మారింది. ప్రభుత్వ భూములను అప్పనంగా దోచుకునేందుకు దోహదపడింది. పెత్తందార్లు చేతుల్లో ఉన్న ఆక్రమిత భూములకు చట్టబద్ధత కల్పించేందుకు ఉపయోగపడింది. వైసీపీ నేతలు రూ.కోట్లకు పడగెత్తేలా చేసింది. అధికారులను దారికి తెచ్చుకుని భూములను రిజిస్ర్టేషన్ చేయించుకుని.. ఆపై అమ్మి సొమ్ము చేసుకోవడానికి దారులు కల్పించింది. జిల్లావ్యాప్తంగా 1.36 లక్షల ఎకరాలు అసైన్డు భూములకు యాజమాన్య హక్కులు కల్పించినట్లు, వీటిలో 4వేల ఎకరాలు రిజిస్ట్రేషన్ కూడా చేయించినట్లు అధికారుల పరిశీలనలో తేలింది. వీటిలో అత్యధికం కనిగిరి, మార్కాపురం డివిజన్లలోనే ఉన్నాయంటే ఇక్కడ అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయో తేటతెల్లమవుతోంది.
అందులో లక్షా 36వేల ఎకరాలు అసైన్డ్ భూమి
4వేల ఎకరాలకు రిజిస్ట్రేషన్ చేసినట్లు గుర్తింపు
వైసీపీ నాయకుల కనుసన్నల్లోనే అక్రమం
కనిగిరి, మార్కాపురం డివిజన్లలోనే అధికం
అధికారుల విచారణలో వెలుగులోకి అవకతవకలు
గత వైసీపీ సర్కారు తీసుకొచ్చిన ‘ఫ్రీ హోల్డ్’ చట్టం అక్రమార్కులకు వరంగా మారింది. ప్రభుత్వ భూములను అప్పనంగా దోచుకునేందుకు దోహదపడింది. పెత్తందార్లు చేతుల్లో ఉన్న ఆక్రమిత భూములకు చట్టబద్ధత కల్పించేందుకు ఉపయోగపడింది. వైసీపీ నేతలు రూ.కోట్లకు పడగెత్తేలా చేసింది. అధికారులను దారికి తెచ్చుకుని భూములను రిజిస్ర్టేషన్ చేయించుకుని.. ఆపై అమ్మి సొమ్ము చేసుకోవడానికి దారులు కల్పించింది. జిల్లావ్యాప్తంగా 1.36 లక్షల ఎకరాలు అసైన్డు భూములకు యాజమాన్య హక్కులు కల్పించినట్లు, వీటిలో 4వేల ఎకరాలు రిజిస్ట్రేషన్ కూడా చేయించినట్లు అధికారుల పరిశీలనలో తేలింది. వీటిలో అత్యధికం కనిగిరి, మార్కాపురం డివిజన్లలోనే ఉన్నాయంటే ఇక్కడ అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయో తేటతెల్లమవుతోంది.
ఒంగోలు (కలెక్టరేట్), అక్టోబరు 9 : ఏళ్ల తరబడి అనుభవంలో ఉన్న అసైన్డ్ భూములను అమ్ముకునేందుకు అవకాశం కల్పించినదే ఫ్రీ హోల్ట్ చట్టం. గత వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ఈ చట్టం అక్రమార్కులకు వరంగా మారడంతోపాటు అధికారులకు కాసుల వర్షం కురిపించింది. వైసీపీ ప్రభుత్వం గతేడాది అసైన్డ్, చుక్కలు, ఇనాం భూములకు స్వేచ్ఛ కల్పిస్తున్నామని ప్రచారం చేసి గ్రామగ్రామానా సభలు పెట్టి రైతులకు హక్కులు ఇస్తున్నామని పైకి ఊదరగొట్టి లోలోపల వైసీపీ దళారులు బాగుపడటానికి అవకాశం కల్పించింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఫ్రీ హోల్డ్ భూములపై దృష్టి పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల భూ రికార్డుల పరిశీలన ప్రారంభించింది. గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు జిల్లావ్యాప్తంగా లక్షా 84వేల ఎకరాలకు జగన్ సర్కారు పూర్తి యాజమాన్య హక్కులు కల్పించినట్టు తేలింది. అందులో లక్షా 36 వేల ఎకరాలు అసైన్డ్‌భూములు, 37వేల ఎకరాల చుక్కల భూములు, 9వేల ఎకరాలు ఇనాం భూములు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. 4వేల ఎకరాల అసైన్డ్ భూములను రిజిస్ట్రేషన్ చేసినట్లు ఇప్పటి వరకూ అధికారులు చేసిన విచారణలో తేలింది. విచారణ పూర్తయితే ఎన్నివేల ఎకరాలు ఫ్రీ హోల్డ్ అయ్యాయో వెలుగులోకి వచ్చే అవకాశముంది.
జిల్లావ్యాప్తంగా ఫ్రీ హోల్డ్ భూములు
అసైన్డ్ భూములు : 1,36,000
చుక్కల భూములు : 37,000
సర్వీస్, ఇనాం భూములు : 9,000
డివిజన్ల వారీగా ఫ్రీ హోల్డ్ భూములు
డివిజన్ ఎకరాలు
కనిగిరి డివిజన్ 84,611
మార్కాపురం డివిజన్ 48,523
ఒంగోలు డివిజన్ 3,286
మండలాల వారీగా ఫ్రీ హోల్డ్‌లో పెట్టిన అసైన్డ్ భూముల వివరాలు
మండలం ఎకరాలు
సీఎ్‌సపురం 8,505
దర్శి 2,302
దొనకొండ 125
హనుమంతునిపాడు 8,456
కనిగిరి 11,931
కేకేమిట్ల 12,750
కురిచేడు 689
మర్రిపూడి 6591
పిసిపల్లి 9773
పామూరు 4945
పొదిలి 9723
పొన్నలూరు 1761
వెలిగండ్ల 7055
ఆర్ధవీడు 272
బేస్తవారిపేట 4,344
కంభం 1,043
దోర్నాల 4,054
గిద్దలూరు 4,374
కొమరోలు 1,168
మార్కాపురం 3,501
పెద్దారవీడు 4,940
పుల్లలచెరువు 10,464
రాచర్ల 1,984
తర్లుబాడు 5,227
త్రిపురాంతకం 4,502
వైపాలెం 2,646
చీమకుర్తి 138
కొండపి 298
కొత్తపట్నం 651
ముండ్లమూరు 291
నాగులుప్పలపాడు1,114
ఒంగోలు 402
జరుగుమల్లి 197
వైసీపీ నేతలకు అనుకూలంగా భూములు
గత ప్రభుత్వ నిర్ణయం వైసీపీ నేతలకు వరంగా మారింది. వేల కోట్ల విలువచేసే భూములను కొల్లగొట్టడానికి ఉపయోగపడింది. చాలా మంది వైసీపీ నేతలు విలువైన భూములను తమ కుటుంబ సభ్యులు, అనుచరుల పేరుతో రిజస్ట్రేషన్ చేయించుకున్నారు. మార్కాపురం, కనిగిరి డివిజన్లలో ఈ భూముల వ్యవహారం మరింత ఎక్కువగా ఉంది. డివిజన్ కేంద్రమైన కనిగిరితోపాటు ఆ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. అప్పటి ముఖ్య ప్రజాప్రతినిధి కనుసన్నల్లోనే ఈ ప్రక్రియ జరిగిందనే ఆరోపణలు బలంగా ఉన్నాయి.
మార్కాపురం, కనిగిరి డివిజన్లలోనే అత్యధికం
జిల్లాలోని మార్కాపురం, కనిగిరి డివిజన్లలోనే అత్యధికంగా అసైన్డ్‌భూములను ఫ్రీహోల్డ్‌లో పెట్టారు.
కనిగిరి డివిజన్‌లో 1,95,938 ఎకరాలు అసైన్డ్ భూములు ఉండగా అందులో 84,611 ఎకరాలను ఫ్రీ హోల్డ్‌లో ఉంచారు.
మార్కాపురం డివిజన్‌లో 1,19,228 ఎకరాలు అసైన్డ్ భూములు ఉండగా అందులో 48,523 ఎకరాలను ఫ్రీహోల్డ్ చేశారు.
ఒంగోలు డివిజన్‌లో 29,571 ఎకరాలు అసైన్డ్ భూములు ఉండగా 3,286 ఎకరాలను ఫ్రీ హోల్డ్‌లో పెట్టారు. సింగరాయకొండలో 3.91 ఎకరాలు, మద్దిపాడు 5.70 ఎకరాలు, టంగుటూరు 58 ఎకరాలు, సంతనూతలపాడు 52.53 ఎకరాలు, తాళ్లూరు 72 ఎకరాలను ఫ్రీ హోల్డ్‌లో పెట్టగా జిల్లాలోని మిగిలిన మండలాల్లో వంద నుంచి వేల ఎకరాలను ఫ్రీ హోల్డ్ చేశారు.
Updated Date - Oct 09 , 2024 | 11:42 PM