ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వేసవి సాగుకు సిద్ధమవుతున్న రైతాంగం

ABN, Publish Date - May 15 , 2024 | 01:57 AM

మండలంలోని రైతాంగం వేసవి సాగుకు సన్నద్ధమవుతోంది. వాతావరణం చల్లబడుతుండడంతో పలు చోట్ల రైతులు భూములను దుక్కులు చేసి పశువుల ఎరువులు వేసి సారవంతం చేస్తున్నారు.

పెద్ద దోర్నాల, మే 14: మండలంలోని రైతాంగం వేసవి సాగుకు సన్నద్ధమవుతోంది. వాతావరణం చల్లబడుతుండడంతో పలు చోట్ల రైతులు భూములను దుక్కులు చేసి పశువుల ఎరువులు వేసి సారవంతం చేస్తున్నారు. జూన్‌ మాసం ఆరంభంలో తొలకరి వార్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణశాఖ ప్రకటనతో పాటు ఇటీవల కురిసిన మోస్తరు వానతో ఎండలు తగ్గుముఖం పట్టాయి. కొద్దోగొప్పో నీరున్న బోరుబావుల కింద వేసవి సాగు చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో అధిక శాతం రైతులు సాధారణంగా తమ కున్న వ్యవసాయ భూముల్లో సగ భాగం పత్తి, మరో సగ భాగం మిరప సాగు చేయడం ఆనవాయితీగా వస్తోంది. వేసవి, ఖరీఫ్‌ సీజను మొదటి భాగం జూన్‌, జులైలో తక్కువ పెట్టుబడితో పత్తిసాగు చేసి ఆ పంటపై వచ్చే ఆదాయంతో ఖరీఫ్‌ రెండో భాగం ఆగస్టు, సెప్టెంబరు మాసాల్లో మిరప సాగు చేపడతారు. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు రైతులు పత్తి విత్తేందుకు పొలాలను సిద్ధం చేశారు. వారం పది రోజుల్లో పత్తి విత్తేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మండలంలో వేసవిలో సుమారు 500 ఎకరాల్లో పత్తిసాగు చేయనున్నట్లు రైతులు తెలిపారు. పరిస్థితులను బట్టి ఖరీఫ్‌లో మరో 700ఎకరాల్లో పత్తి సాగు చేసే అవకాశం ఉంది.

గిట్టుబాటు ధరలుపై అయోమయం

గతేడాది పత్తి సాగు చేసిన రైతులు నష్ట పోయారు. వేసవిలో సాగు చేసిన పత్తికి నీటి కొరత కారణం కాగా, ఖరీఫ్‌లో సాగు చేసిన పత్తికి గిట్టుబాటు ధరలు లేక వర్షాలు తగిన స్థాయిలో కురవక పోవడం, నివారణ కాని తెగులు సోకి పంట దిగుబడులు తగ్గి తీవ్రంగా నష్ట పోయారు. అయినప్పటికీ, ఏమి చేయాలో పాలుపోక ఈ ఏడాదైనా గిట్టుబాటు ధర లభించకపోదా..? అన్న ఆశతో ఉన్న భూమి మొత్తం మిరప సాగు చేయలేమని పత్తి సాగుకు ఉపక్రమిస్తున్నారు. అపరాలు సాగు చేద్దామన్నా విత్తనాల ఖర్చు కూడా రాదని మదనపడుతున్నారు.

పెరిగిన పెట్టుబడి ఖర్చు

ఎకరం పత్తి సాగు చేయాలంటే కనీసంలో కనీసం రూ.35 వేలు అవసరం అవుతుంది. దుక్కికి రూ.2,000లు, గొర్రు, గుంటక ఖర్చుకు రూ.1,500లు, అచ్చు తోలకానికి ఖర్చు రూ.800లు, పత్తి విత్తనాలు ప్యాకెట్టు రూ.850 చొప్పున 3 ప్యాకెట్లు రూ.2,550లు, ముగ్గురు కూలీలకు రూ.600లు, లారీ పశువుల ఎరువు రూ.20,000లు. దీనికి ప్రత్యామ్నాయంగా రసాయన ఎరువులు 4బస్తాలు రూ.8,000లు, కలుపు తీతలకు రూ.1,200లు, అంతరసేద్యం ఖర్చు రూ.6,400లు, పురుగుమందుల ఖర్చు రూ.10,000లు అవసరమవుతాయి. పత్తితీతలు కాకుండా రూ.33,000ల నుండి రూ.35,000ల వరకు సొంత భూమి ఉన్న వారికి పెట్టుబడి కావాల్సి ఉంది. కౌలు ధరలు అదనం. ఈ ప్రాంతంలో నీటి వసతిని బట్టి ఎకరం కౌలు రూ.10 వేల నుండి రూ.50వేల వరకు చెల్లించాల్సి ఉంది. పత్తి క్వింటాలు ధర ప్రస్తుతం రూ.6వేల వరకు పలుకుతోంది. రూ.10 వేలు పలికితేనే పత్తిరైతు మనగలగుతాడని రైతులు చెబుతున్నారు. కాలం అనుకూలంగా లేకపోతే కౌలు చెల్లించలేని దుస్థితి ఏర్పడుతుందన్నారు. అయినా ఎప్పుడూ ఇలాగే ఉంటుందా...? మంచి రోజులు రాకపోతాయా అని కొందరు రైతులు సాగుకు సిద్ధం చేస్తున్నారు..!

Updated Date - May 15 , 2024 | 01:57 AM

Advertising
Advertising