ఎట్టకేలకు అగ్నిమాపక కేంద్రానికి స్థలం
ABN, Publish Date - Oct 04 , 2024 | 12:09 AM
ఎన్నో దశాబ్దల నుంచి ఎదురు చూస్తున్న అద్దంకి లోని అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు దశాబ్ద కాలం కిందట జరిగింది. అయితే అప్పటి నుంచి స్థలం కేటాయింపు ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. తొలుత మేదరమెట్ల రోడ్డులో స్థలం కేటాయింపు జరిగినా అనువుగా లేకపోవడంతో విరమించుకున్నారు. అనంతరం పలు చోట్ల పరిశీలన చేసినా ఏదో ఒక విధంగా అడ్డంకులు ఎదురయ్యాయి.
దశాబ్దకాలం తరువాత కేటాయింపు
మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే దృష్టిసారించిన రవికుమార్
నిధులు మంజూరు, నిర్మాణం వేగవంతం అయ్యేనా
అద్దంకి, అక్టోబరు 3 : ఎన్నో దశాబ్దల నుంచి ఎదురు చూస్తున్న అద్దంకి లోని అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు దశాబ్ద కాలం కిందట జరిగింది. అయితే అప్పటి నుంచి స్థలం కేటాయింపు ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. తొలుత మేదరమెట్ల రోడ్డులో స్థలం కేటాయింపు జరిగినా అనువుగా లేకపోవడంతో విరమించుకున్నారు. అనంతరం పలు చోట్ల పరిశీలన చేసినా ఏదో ఒక విధంగా అడ్డంకులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో అగ్నిమాపక కేంద్రానికి స్థల కేటాయింపు దశాబ్దకాలం ఆలస్యం అయింది. 2013 డిసెంబరులో అద్దంకిలో అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మార్కెట్‌యార్డు ఆవరణలో తాత్కాళికంగా ఏర్పాటు చేశారు. అగ్నిమాపక వాహనం ఉంచేందుకు వసతి లేకపోవడంతో గొట్టిపాటి రవికుమార్ 2014లో తన సొంత నిధులు సుమారు రూ.లక్ష కేటాయించి రేకుల షెడ్‌ను ఏర్పాటు చేయంచారు. మార్కెట్ యార్డ్ కార్యాలయంలో ఓ గదిని ఫైర్‌స్టేషన్ అధికారి, సిబ్బంది, కార్యాలయానికి కేటాయించారు. దీంతో సిబ్బంది విశ్రాంతి తీసుకోవాలన్నా ఆరుబయటే ఉండాల్సిన పరిస్థితి. ఇలా దశాబ్దకాలం పైనే గడిచిపోయింది. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడడం, గొట్టిపాటి రవికుమార్ విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో అగ్నిమాపక కేంద్రం అధికారులు, సిబ్బందిలో ఆశలు చిగురించాయి. ఇటీవల గొట్టిపాటి అద్దంకి వచ్చిన సమయంలో అగ్నిమాపక కేంద్రం స్థల సమస్య ఆయన దృష్టికి వచ్చింది. వెంటనే స్థల కేటాయింపునకు చర్యలు చేపట్టాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శింగరకొండ రోడ్డులో 23 సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించారు. అవసరమైన మేర నిధులు కేటాయించి అన్ని వసతులతో అగ్నిమాపక కేంద్ర నిర్మాణంపై ఉన్నతాధికారులు దృష్టి సారిస్తే అద్దంకిలో ఫైర్ ఆఫీస్‌కు సొంత భవనం కల నెరవేరే అవకాశం ఉంది. నామ్‌రోడ్డు వెంబడే స్థలం కేటాయింపు జరగడంతో మరింత సౌకర్యంగా ఉంటుందని సిబ్బంది, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - Oct 04 , 2024 | 12:09 AM