ఎట్టకేలకు ప్రక్షాళన
ABN, Publish Date - Nov 02 , 2024 | 01:10 AM
ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయంలోని రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేస్తూ కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు శుక్రవారం ఉత్వర్వులు జారీచేశారు. గత కొద్దిరోజులుగా ఆర్‌ఐల నియామకంపై సందిగ్ధం నెలకొనగా ఎట్టకేలకు తెరపడింది. కాగా గతంలో ఇద్దరు ఆర్‌వోలు, ఎనిమిది మంది ఆర్‌ఐలు ఉండగా.. ప్రస్తుతం ఒక ఆర్‌వో, నలుగురు ఆర్‌ఐలకు మాత్రమే పరిమితం చేశారు.
కార్పొరేషన్ రెవెన్యూలో కీలక మార్పులు
కొత్తగా ఆర్‌వో, నలుగురు ఆర్‌ఐల నియామకం
గతంలో ఉన్నవారు ఇతర సెక్షన్లకు..
ఒంగోలు, కార్పొరేషన్, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయంలోని రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేస్తూ కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు శుక్రవారం ఉత్వర్వులు జారీచేశారు. గత కొద్దిరోజులుగా ఆర్‌ఐల నియామకంపై సందిగ్ధం నెలకొనగా ఎట్టకేలకు తెరపడింది. కాగా గతంలో ఇద్దరు ఆర్‌వోలు, ఎనిమిది మంది ఆర్‌ఐలు ఉండగా.. ప్రస్తుతం ఒక ఆర్‌వో, నలుగురు ఆర్‌ఐలకు మాత్రమే పరిమితం చేశారు. రెవెన్యూ అధికారిగా ఎల్.విజయభాస్కర్‌బాబు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లుగా బి.కల్యాణి,వి.నిరూప్‌కుమార్, ఎస్.శ్రీనివాసులు, కె.వెంకటేశ్వర్లును నియమించారు. గతంలో ఆర్‌వోలుగా పనిచేసిన శ్రీహరి, టిహెచ్.మధుసూదనరావు, ఆర్‌ఐలుగా పనిచేసిన శ్రీనాథ్, వి.సాయిచంద్, పి.అఖండకుమార్, ఎం.శ్రీనివాసరావు, టి.సుజాత, వి.రాధ, అమ్మిరెడ్డి, ఎం.కెజియాసుస్మితలను పరిపాలన సౌలభ్యం దృష్ట్యా ఇతర సెక్షన్‌లకు బదిలీ చేశారు. అయితే రెవెన్యూ సెక్షన్‌లో ఆర్‌ఐల మార్పులు, చేర్పులపై గత కొద్దిరోజులుగా అధికారులపై ఒత్తిడి నెలకొంది. ఇప్పటికే ఆర్‌ఐలుగా ఉన్నవారు కొందరు తమ సీట్లను కాపాడుకునేందుకు తీవ్రస్థాయిలో రాజకీయ పలుకుబడి ఉపయోగించారు. అదేవిధంగా ఆర్‌ఐలుగా వచ్చేందుకు ఆసక్తిచూపిన వారు తమదైన స్థాయిలోనూ సిఫార్సులు చేయించినట్లు సమాచారం. అయితే ఇరవై రోజుల నుంచి సాగిన ఆర్‌ఐల మార్పుపై చర్చకు ఎట్టకేలకు ఫుల్‌స్టాప్ పడింది. మొత్తంగా ఆదాయ వనరులు కలిగిన ఆ రెవెన్యూ సెక్షన్‌లో సీటు కోసం జరిగిన పరిణామాలు కార్పొరేషన్ కార్యాలయంలో చర్చనీయాంశంగా మారాయి.
Updated Date - Nov 02 , 2024 | 01:11 AM