వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని కడతేర్చాడు!
ABN, Publish Date - Oct 22 , 2024 | 12:40 AM
మండలంలోని ఊళ్లపాలెంలో భార్యను కత్తితో పొడిచి చంపిన భర్తను పోలీసులు అరెస్టు చేశారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందన్న కారణంతోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తేల్చారు. నిందితుడిని కందుకూరు పోలీసు స్టేషన్‌లో హాజరుపర్చగా న్యాయాధికారి రిమాండ్ విధించారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ హజరత్తయ్య వివరాలను వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. నెల్లూరు జిల్లా ఇసుకపల్లికి చెందిన పురిణి మాలకొండయ్య, ఆదెమ్మ దంపతులకు ఐదుగురు కుమార్తెలున్నారు.
వివరాలను వెల్లడించిన సీఐ హజరత్తయ్య
సింగరాయకొండ, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని ఊళ్లపాలెంలో భార్యను కత్తితో పొడిచి చంపిన భర్తను పోలీసులు అరెస్టు చేశారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందన్న కారణంతోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తేల్చారు. నిందితుడిని కందుకూరు పోలీసు స్టేషన్‌లో హాజరుపర్చగా న్యాయాధికారి రిమాండ్ విధించారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ హజరత్తయ్య వివరాలను వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. నెల్లూరు జిల్లా ఇసుకపల్లికి చెందిన పురిణి మాలకొండయ్య, ఆదెమ్మ దంపతులకు ఐదుగురు కుమార్తెలున్నారు. వారిలో నాలుగో కుమార్తె అయిన లక్ష్మీతిరుపతమ్మను సింగరాయకొండ మండలంలోని ఊళ్లపాలెం గ్రామానికి చెందిన పుట్టా వెంకట్రావుకు ఇచ్చి 2018 మార్చిలో వివాహం చేశారు. తొలుత వారి దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. ఒక కుమారుడు, కుమార్తె జన్మించారు. కొంతకాలం నుంచి వెంకట్రావు మద్యానికి బానిసవడంతోపాటు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. వివాహేతర సంబంధానికి అడ్డుచెప్తున్నదన్న కారణంతో లక్ష్మీతిరుపతమ్మను వెంకట్రావు మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల 17న భార్యాభర్తల మధ్య వివాదం జరిగింది. ఆ సమయంలో వెంకట్రావు ఇంట్లో ఉన్న కత్తితో లక్ష్మీతిరుపతమ్మ మెడభాగంలో విచక్షణారహితంగా పొడిచాడు. దీంతో తీవ్రరక్తస్రావమై ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. బంధువులు సింగరాయకొండలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందింది. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సోమవారం స్థానిక కందుకూరు ఫ్లైవోవర్ వద్ద నిందితుడు వెంకట్రావును అరెస్ట్ చేశారు. అనంతరం కందుకూరు కోర్టులో హాజరుపరగా న్యాయాధికారి 14 రోజులు రిమాండ్ విధించినట్లు సీఐ వివరించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఒంగోలులో ఇటీవల అతికిరాతకమైన చెడ్డీ గ్యాంగ్ కదిలికలను గుర్తించామని సీఐ హజరత్తయ్య తెలిపారు. ఈనేపథ్యంలో సింగరాయకొండ సర్కిల్ పరిధిలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇంటికి తాళాలు వేసుకొని ఇతర గ్రామాలకు, ప్రాంతాలకు వెళ్లేవారు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ముందుగా సమాచారం ఇవ్వాలన్నారు. ఆ ఇళ్లపై ప్రత్యేక నిఘా ఉంచుతామని వెల్లడించారు. అధిక మెత్తంలో బంగారం, నగదు ఉంటే బ్యాంకులలో దాచుకోవాలని సూచించారు. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ గృహాలలో సీసీ కెమెరాలను అమర్చుకోవాలన్నారు.
Updated Date - Oct 22 , 2024 | 12:40 AM