అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ABN, Publish Date - Nov 07 , 2024 | 10:00 PM
మేదరమెట్లలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సహకారంతో విద్యార్థులు, ప్రజల కు ఉపయోగపడే రోడ్ల నిర్మాణ పనులు చేపడుతున్నట్లు టీడీపీ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు మన్నె రామారావు అన్నారు. గురువారం మేదరమెట్లలో రూ.40లక్షల విలువైన సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.
రూ.40లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం
మేదరమెట్ల, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి) : మేదరమెట్లలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సహకారంతో విద్యార్థులు, ప్రజల కు ఉపయోగపడే రోడ్ల నిర్మాణ పనులు చేపడుతున్నట్లు టీడీపీ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు మన్నె రామారావు అన్నారు. గురువారం మేదరమెట్లలో రూ.40లక్షల విలువైన సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామంలో ఇంకా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ మన్నె దుర్గారావు, గ్రామ నాయకులు మన్నె శ్రీనివాసరావు, బత్తుల శ్రీనివాసరావు (డాల్పిన్ శ్రీను), పఠన్ సర్దార్ ఖాన్, వడ్లమూడి శివ, మన్నె యుగంధర్, పుట్టా బుల్లియ్య, ఓగూరి వెంకట్రావు, రేగుల రామాంజనేయలు, పలువురు వార్డు నెంబర్లు, మహిళలు పాల్గొన్నారు.
Updated Date - Nov 07 , 2024 | 10:00 PM