కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయానికి నేడు శంకుస్థాపన
ABN, Publish Date - Oct 20 , 2024 | 10:37 PM
చినకొత్తపల్లి వద్ద కల్యాణ వేంకటేశ్వర స్వా మి ఆలయాన్ని నిర్మించనున్నారు. శ్రీ యాన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్‌ఆర్‌ఐల సహకారంతో మండలంలోని చినకొత్తపల్లి క్రాస్ రోడ్డు వద్ద నామ్ రోడ్డు వెంబడి భారీ వ్యయంతో కల్యాణ వేంకటేశ్వరస్వామి దేవాలయం నిర్మాణానికి సోమవారం ఉదయం 9-10 గంటలకు శంకుస్థాపన జరుగుతుందని ట్రస్ట్ ఫౌండర్, ఎన్‌ఆర్‌ఐ దేవినేని శ్రీకాంత్ తెలిపారు.
ఎన్‌ఆర్‌ఐల సహకారంతో నిర్మాణం
అద్దంకి, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి) : చినకొత్తపల్లి వద్ద కల్యాణ వేంకటేశ్వర స్వా మి ఆలయాన్ని నిర్మించనున్నారు. శ్రీ యాన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్‌ఆర్‌ఐల సహకారంతో మండలంలోని చినకొత్తపల్లి క్రాస్ రోడ్డు వద్ద నామ్ రోడ్డు వెంబడి భారీ వ్యయంతో కల్యాణ వేంకటేశ్వరస్వామి దేవాలయం నిర్మాణానికి సోమవారం ఉదయం 9-10 గంటలకు శంకుస్థాపన జరుగుతుందని ట్రస్ట్ ఫౌండర్, ఎన్‌ఆర్‌ఐ దేవినేని శ్రీకాంత్ తెలిపారు. అనంతరం 9-30 గంటల నుంచి స్వామి వారి కల్యాణం ప్రారంభమవుతుందని తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు అన్నదానం ఉంటుందన్నారు. స్వామి వారి కల్యాణం జరిగే ప్రాంతంలో వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా రేకులతో తాత్కాళిక షెడ్‌ను ఏర్పాటు చేశారు.
Updated Date - Oct 20 , 2024 | 10:37 PM