ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఇంధనం లేక నిలిపివేత

ABN, Publish Date - Nov 07 , 2024 | 02:31 AM

ప్రాణాపాయ పరిస్థితుల్లో ఆపద్బాంధవుల్లా ఆదుకుంటున్న 108 వాహనాలు మూగబోతున్నాయి. నిత్యం ఎక్కడ ఏప్రమాదం జరిగినా సత్వరమే చేరుకునే వాటికి ఇంధనం (డీజిల్‌) లేని పరిస్థితి నెలకొంది. ఆ వాహనాలకు అవసరమైన మేరకు డీజిల్‌ లేకపోవడంతో ఎప్పుడు ఎక్కడ ఆగిపోతాయోనని పైలెట్లు ఆందోళన చెందుతున్నారు.

కదలని 108 వాహనాలు

డీజిల్‌కు నిధులు అందని పరిస్థితి

అప్పుపై పోసేందుకు పెట్రోలు బంకుల యజమానులు ససేమిరా

ప్రభుత్వం నుంచి సంస్థకు రాని బకాయిలు

10 వాహనాలు బంద్‌

ఒంగోలు కలెక్టరేట్‌, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి) : ప్రాణాపాయ పరిస్థితుల్లో ఆపద్బాంధవుల్లా ఆదుకుంటున్న 108 వాహనాలు మూగబోతున్నాయి. నిత్యం ఎక్కడ ఏప్రమాదం జరిగినా సత్వరమే చేరుకునే వాటికి ఇంధనం (డీజిల్‌) లేని పరిస్థితి నెలకొంది. ఆ వాహనాలకు అవసరమైన మేరకు డీజిల్‌ లేకపోవడంతో ఎప్పుడు ఎక్కడ ఆగిపోతాయోనని పైలెట్లు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా 108కు డీజిల్‌ ఫుల్‌ట్యాంకు చేయించుకొని అందుబాటులో ఉంచుకోవాలి. ప్రమాదం జరిగినట్లు ఫోన్‌ వచ్చిందంటే ఏసమయంలోనైనా సరే అక్కడకు ఆగమేఘాలపై వెళ్లాలి. అటువంటి వాహనాల నిర్వహణ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా అరబిందో సంస్థకు 108 వాహనాల నిర్వహ ణ కాంట్రాక్టు అప్పగించింది. ప్రస్తుతం కూడా ఆ సంస్థనే చూస్తోంది. అందులో భాగంగా మన జిల్లాలో 40 వాహనాలు నడుస్తున్నాయి. వాటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత ఆ సంస్థపై ఉంటుంది. జిల్లాలో బుధవారం 10 వాహనాలు నిలిచిపోయాయి. జిల్లా కేంద్రమైన ఒంగోలుతోపాటు కురిచేడు, పలు ఇతర మండలాల్లో వాహనాలు ఆగిపోయాయి. కేవలం 30 వాహనాలు మాత్రమే రన్నింగ్‌లో ఉండగా వాటిలోనూ డీజల్‌ అయిపోతే అవి పక్కనపెట్టే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాలేదన్న కారణంతో 108 వాహనాలకు అవసరమైన డీజిల్‌, ఇతర మెయిటినెన్స్‌కు సంస్థ డబ్బులు ఇవ్వని పరిస్థితి ఏర్పడింది. ఒక రోజు ఒక ప్రాంత వాహనాలకు డీజిల్‌ కొట్టించి నడుపుతున్నట్లు సమాచారం.

డిజిల్‌ వినియోగంపై సంస్థ ఆంక్షలు

సంస్థ రోజువారీ డీజిల్‌ కోసం కొంత నగదును నిర్ణయించి ఇస్తున్నట్లు సమాచారం. కొన్నిసార్లు 108 వాహనం ఎక్కువ తిరగాల్సి రావడంతో ఆ డీజల్‌ ఒక్క రోజుకే సరిపోతుంది. గతంలో రోజువారీ కాకుండా ఆ వాహనానికి ఉన్న ట్యాంకును పుల్‌ చేయించుకునే వారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంతో రోజువారీ ఒక్కో వాహనానికి ఐదారు వందలకు మాత్రమే డీజిల్‌ కొట్టిస్తున్నట్లు సమాచారం. ఆ వినియోగంపై కూడా ఆంక్షలు పెడుతుండటంతో డ్రైవర్లు (ఫైలెట్‌) దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. గతంలో డీజిల్‌ బంకుల్లో ఆ వాహనాలకు ఆప్పునకు పోసేవారు. నెలవారీ బిల్లులు చెల్లించేవారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంతో ఏరోజుకారోజు పోయించుకోవాల్సి వస్తోంది. దీంతో వాహనాలు ఎప్పుడు నిలిచిపోతాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.

Updated Date - Nov 07 , 2024 | 02:31 AM