గుంటూరు చానల్ పనులకు అనుమతి ఇవ్వండి
ABN, Publish Date - Nov 24 , 2024 | 12:08 AM
పర్చూరును సస్యశ్యామ లం చేసే గుంటూరు చానల్ పనులకు అనుమతులు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబును పర్చూరు, ప్రత్తిపాడు ఎమ్మెల్యేలు ఏలూరి సాం బశివరావు, బూర్ల రామాంజనేయులు కోరారు. శనివారం సీఎం చంద్రబాబును మర్యాద పూర్వకంగా సీఎం క్యాంపు ఆఫీసులో కలిశారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే ఏలూరి మాట్లాడుతూ గుంటూరు చానల్‌ను పర్చూ రు వరకు పొడిగిస్తే ఆ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందన్నారు.
పర్చూరు, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి) : పర్చూరును సస్యశ్యామ లం చేసే గుంటూరు చానల్ పనులకు అనుమతులు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబును పర్చూరు, ప్రత్తిపాడు ఎమ్మెల్యేలు ఏలూరి సాం బశివరావు, బూర్ల రామాంజనేయులు కోరారు. శనివారం సీఎం చంద్రబాబును మర్యాద పూర్వకంగా సీఎం క్యాంపు ఆఫీసులో కలిశారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే ఏలూరి మాట్లాడుతూ గుంటూరు చానల్‌ను పర్చూ రు వరకు పొడిగిస్తే ఆ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందన్నారు. 50 గ్రా మాలకు తాగు, సాగు నీరు అందుతుందన్నా రు. గుంటూరు చానల్ రైతుల ఎనిమిది దశాబ్దాల కల అన్నారు. గతంలో టీడీపీ హయాంలో గుంటూరు జిల్లా, యామర్రు నుంచి పర్చూరు వరకు సుమారు 29.4 కిలోమీటర్ల కాలువ పొడిగింపునకు నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని ఏలూరి గుర్తు చేశారు. తరువాత అధికారంలోకి వచ్చిన జగన్ పనులను రద్దు చేశారన్నారు. త్వరితగతిన భూసేకరణ చేపట్టి చానల్ పను లు ప్రారంభించేలా చూడాలని కోరారు. ఈ చానల్ పూర్తి చేస్తే గుంటూరు, ప్రకాశం జిల్లాలోని ప్రత్తిపాడు, యడ్లపాడు, చిలకలూరిపేట, పెద్దనందిపాడు, పర్చూరు మండలాల్లోని గ్రామాల్లోని వేల ఎకరరాల భూములకు సాగునీటితోపాటు, ప్రజలకు తాగునీరు అం దుతుందన్నారు. దీనిపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే ఏలూరి తెలిపారు.
Updated Date - Nov 24 , 2024 | 12:08 AM