ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వేములబండలో శ్మశానం కబ్జా

ABN, Publish Date - Dec 02 , 2024 | 11:31 PM

మండలంలోని వేములబండలో సర్వే నెంబరు 71లో ఉన్న 2.51 ఎకరాలు బండిదారి పోరంబోకు భూమిని కొందరు ఆక్రమించుకొని సాగు చేసుకుంటున్నారు. పట్టించుకోవాల్సిన రెవెన్యూ, పంచాయతీ అధికారులు ఆవైపు కన్నెత్తి కూడా చూడటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామానికి కూత వేటు దూరంలో ఉన్న శ్మశాన ఆక్రమణ స్థలం విలువ దాదాపు రూ.25 లక్షలకు పైగా మాటే. వేములబండ నుంచి రమణారెడ్డిపాలెం వెళ్ళే రహదారికి పక్కనే ఆనుకొని ఉన్న విలువైన శ్మశానం భూమిపై అక్రమార్కుల కన్ను పడింది.

వేములబండలో ఆక్రమణకు గురైన శ్మశాన స్థలం

ముండ్లమూరు, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): మండలంలోని వేములబండలో సర్వే నెంబరు 71లో ఉన్న 2.51 ఎకరాలు బండిదారి పోరంబోకు భూమిని కొందరు ఆక్రమించుకొని సాగు చేసుకుంటున్నారు. పట్టించుకోవాల్సిన రెవెన్యూ, పంచాయతీ అధికారులు ఆవైపు కన్నెత్తి కూడా చూడటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామానికి కూత వేటు దూరంలో ఉన్న శ్మశాన ఆక్రమణ స్థలం విలువ దాదాపు రూ.25 లక్షలకు పైగా మాటే. వేములబండ నుంచి రమణారెడ్డిపాలెం వెళ్ళే రహదారికి పక్కనే ఆనుకొని ఉన్న విలువైన శ్మశానం భూమిపై అక్రమార్కుల కన్ను పడింది. శ్మశానం భూమి అయితే అడిగే వారు లేనట్టుగా యథేచ్ఛగా ఆక్రమించుకొని వరితో పాటు ఇతర పంటలు సాగు చేశారు. దీంతో ఆ గ్రామంలో ఎవరైనా చనిపోతే పూడ్చి పెట్టేందుకు, ఖననం చేసేందుకు చాలినంత స్థలం లేక ఇబ్బందులు పడుతున్నారు. శ్మశానం ఆక్రమణకు గురైందని గ్రామస్థులు ఫిర్యాదు చేసినా సంబంధిత అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. దీనికితోడు శ్మశానం స్థలం మధ్యలో గుండా కొందరు పొలాలకు వెళ్ళేందుకు దారిని ఆక్రమించుకొని వెళ్తున్నారు. దాదాపు 2.51 ఎకరాలు బండి పోరంబోకు భూమి ఉండగా అందులో 1.50 ఎకరాలకు పైగా స్థలం ఆక్రమణదారుల చేతుల్లోకి వెళ్ళింది. ఇప్పటికైనా సంబందిత అధికారులు స్పందించి శ్మశాన స్థలాన్ని ఆక్రమణకు గురికాకుండా చూడాలని గ్రామస్థు కోరుతున్నారు.

మా దృష్టికి రాలేదు

వేములబండలో సర్వే నెంబరు 71లో ఉన్న 2.51 ఎకరాలు బండి దారి పోరంబోకు స్థలాన్ని శ్మశానికి కేటాయించారని ఇన్‌చార్జ్‌ తహసీల్దార్‌ ఆర్‌.శ్రీకాంత్‌ తెలిపారు. అందులో కొంతభాగం ఆక్రమణకు గురైనట్టు గ్రామస్థులు పేర్కొంటున్నారు.

ఈవిషయమై తన దృష్టికి రాలేదని చెప్పారు. విచారించి శ్మశానాన్ని ఆక్రమించిన వారికి నోటీసులు ఇస్తామని తెలిపారు.

Updated Date - Dec 02 , 2024 | 11:31 PM