ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పర్చూరు వద్ద హైవే నిర్మాణ పనులు

ABN, Publish Date - Nov 29 , 2024 | 11:34 PM

పర్చూరు మండల పరిధిలో 167ఏ జాతీయ రహదారి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. పిడుగురాళ్ల నుంచి వాడరేవు వరకు దాదాపు 82 కిలోమీటర్ల మేర హైవే నిర్మాణం చేపట్టేందుకు నిధులు మంజూరు చేశారు.

శరవేగంగా హైవే నిర్మాణ పనులు

పిడుగురాళ్ల నుండి వాడరేవుకు హైవే రోడ్డు ఏర్పాటు

పర్చూరు, నవంబరు 29(ఆంధ్రజ్యోతి) : మండల పరిధిలో 167ఏ జాతీయ రహదారి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. పిడుగురాళ్ల నుంచి వాడరేవు వరకు దాదాపు 82 కిలోమీటర్ల మేర హైవే నిర్మాణం చేపట్టేందుకు నిధులు మంజూరు చేశారు. అందులో భాగంగా పర్చూరును అనుసంధానిస్తూ కారంచేడు మీదుగా వాడరేవు వరకు హైవే రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం పర్చూరు-కారంచేడు మధ్య పనులు చకచకా సాగుతున్నాయి. రోడ్డు నిర్మాణంతోపాటు కల్వర్టులు, ఫ్లైఓవర్‌ ఏర్పాటుకు సంబంధించిన పనులు చేపట్టారు. పర్చూరు వైజంక్షన్‌లో ఫ్లైఓవర్‌ను నిర్మించే విధంగా ప్రతిపాదించారు. ప్రస్తుతం ఆ కూడలిలో ఫ్లైఓవర్‌ పనులు చేపట్టారు. హైవే నిర్మాణంతో తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య రవాణాకు సులువు కానుంది. అంతేగాక వాడరేవు ఉండటం వల్ల పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందనుంది. అదేవిధంగా వాణిజ్య వ్యాపార రంగం అభివృద్ధికి హైవే నిర్మాణం ఎంతగానో దోహదపడనుంది. ఇప్పటికే వాడరేవు-పిడుగురాళ్ల రహదారి నిర్మాణపు పనులతో పర్చూరు ప్రాంతం రూపురేఖలు మారనున్నాయి.

Updated Date - Nov 29 , 2024 | 11:34 PM