ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రజాపాలనకు ‘వంద ’నాలు

ABN, Publish Date - Sep 21 , 2024 | 01:02 AM

రాష్ట్రంలో ఉన్న పేదల సంక్షేమం కోసం ఎన్‌డీఏ కూటమి నిరంతరం కృషి చేస్తోందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు.

గిద్దలూరు టౌన్‌, సెప్టెంబరు 20 : రాష్ట్రంలో ఉన్న పేదల సంక్షేమం కోసం ఎన్‌డీఏ కూటమి నిరంతరం కృషి చేస్తోందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నగర పంచాయతీ కార్యాలయం వద్ద ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం సభను ఉద్దేశించి ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి మాట్లాడారు. పేదలకు మంచి చేయడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి పనిచేస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించడంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని వివరిం చారు. గత వైసీపీ అందించే సామాజిక ఫించన్‌ 3వేలను ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒకేసారి 4వేలకు పెంచి ప్రజల మన్ననలు ఈ ప్రభుత్వం పొందుతోంద న్నారు.. ల్యాండ్‌టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు చేసి ప్రజల ఆస్తులను సీఎం చంద్రబాబునాయుడు రక్షణ కల్పించారన్నారు ప్రతినెలా 1వ తేదిన జీతాలు చెల్లింపు కార్యక్రమం చేపట్టారన్నారు. వరదకు గురైన విజయవాడను 10 రోజులపాటు కంటికి రెప్పలా కాపాడారన్నారు. నిరుద్యోగ యువతీ యువకులకు 16,437 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు మెగా డీఎస్పీని ప్రకటించారన్నారు. పేదల ఆకలి తీర్చడానికి అన్నాక్యాంటీన్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామ పంచాయతీలకు 1452 కోట్లు మంజూరు చేసి పంచా యతీలకు కూటమి ప్రభుత్వం ప్రాణం పోసిందన్నారు. పట్టణంలో తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని, రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మించి ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరిస్తా మన్నారు. కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్‌ పాముల వెంకటసుబ్బయ్య, జడ్పీటీసీ సభ్యుడు బుడత మధుసూదన్‌యాదవ్‌, కమిషనర్‌ వెంకటదాస్‌, తహసీల్దార్‌ ఆంజనేయరెడ్డి, మాజీ సర్పంచ్‌ దప్పిలి భాస్కర్‌రెడ్డి, పట్టణపార్టీ అధ్యక్షులు సయ్యద్‌ షానేషావలి, కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మార్కాపురం : కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులైన సందర్భంగా ‘ఇది మంచి ప్రభు త్వం’ కార్యక్రమాన్ని పట్టణంలోని 4వ వార్డు పరిధిలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ పోల్‌మేనేజ్‌మెంట్‌ ఇన్‌చార్జ్‌ కందుల రామిరెడ్డి హాజరయ్యారు. ప్రభుత్వ పథకాలను వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ నారాయణరావు, టీడీపీ పట్టణ అధ్యక్షులు షేక్‌ మౌలాలి, కౌన్సిలర్‌ నాలి కొండయ్య, టీడీపీ నాయకులు మాలపాటి వెంకటరెడ్డి, గుంటక వెంకటేశ్వరరెడ్డి, గాయం వెంకటనారాయణరెడ్డి, సయ్యద్‌ గఫార్‌, ఒంటెద్దు రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

పొదిలి : ముఖ్యమంత్రి చంద్రబాబు సారధ్యంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వ వందరోజుల పాలనకు పెద్దఎత్తున ప్రజమోదం లభిస్తుందని టీడీపీ నేత కాటూరి శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం పట్టణంలో నేతపాలెం, బాప్టీస్ట్‌పాలెం, టైలర్స్‌కాలనీలలో తిరుగుతూ ఇదిమంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దివ్యాంగులకు వయోవృద్థులకు పింఛన్‌లను పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని చెప్పారు. రైతులను ఆదుకునేందుకు ధాన్యం కొనుగోలు బకాయిలను చెల్లించడంతోపాటు లాండ్‌టైటిలింగ్‌ చట్టం, అన్నా క్యాంటీన్‌లు, త్వరలో మహిళలకు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు ప్రారంభంలాంటి పలు సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకార ం చుట్టారని కొనియాడారు. మండలంలో అధికారులతో పాటు టీడీపీ శ్రేణులు పెద్దఎత్తున ఇదిమంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో పాల్గొనడం శుభపరిణామమన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

నేడు కొమరోలులో

కొమరోలు : స్థానిక కొమరోలు పంచాయతీ కార్యాలయంలో శనివారం ఉదయం 10 గంటలకు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు టీడీపీ మండల అధ్యక్షులు బోనేని వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారన్నారు. మన ప్రభుత్వం 100 రోజుల పరిపాలనలో ప్రభుత్వం చేపట్టిన కార్యాక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారన్నారు. కావున మండలంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, ప్రజలు హాజరుకావాలని తెలిపారు.

మార్కాపురం రూరల్‌ : కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలకు సమన్యాయం జరుగు తుందని, నాయకులు తెలిపారు. మండలంలోని మన్నెంవారిపల్లె, నాయుడుపల్లి గ్రామాలలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం అధికారులు, నాయకులు కలిసి శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఇంటింటికీ తిరిగి కరపత్రాలను అందజేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక వందరోజులలో చేసిన కార్యక్రమాలను వివరించారు. ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలలో రాష్ట్ర ప్రజలకు సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పెన్షన్‌ లబ్ధిదారులకు ఎన్నికలకు ముందు చెప్పిన మాట ప్రకారం దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు, వృద్ధులు, వితంతువులకు రూ.4 వేలకు పింఛన్‌ పెంచారన్నారు. త్వరలో ఎన్నికల హమీలో ఇచ్చిన సంక్షేమ పథకాలను ప్రారంభిస్తారని అన్నారు. కార్యక్రమంలో పీఎస్‌ కాశీం, డీలర్‌ కందుల శ్రీనివాసరెడ్డి, నాయకులు వల్లపునేని గాలెయ్య, వెంకటరాజు, గర్ని ప్రసాద్‌, షేక్‌ బాజీ, మన్నెం వెంకటేశ్వర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

కంభం : రాష్ట్రంలో ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం మంచిపాలన అందిస్తోందని కంభం జడ్పీటీసీ సభ్యురాలు కొత్తపల్లి జ్యోతి తెలిపారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కంభం, కందులాపురం పంచాయతీలలో ఏర్పాటు చేసిన 100 రోజుల ఎన్‌డిఎ పాలనపై జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన జడ్‌పిటిసి జ్యోతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనేక సంక్షేమ పథకాలతో ప్రజలచేత ఇది మంచి ప్రభుత్వం అనిపించు కున్నారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఫించన్లు, అన్నా క్యాంటీన్‌లు, డీఎస్సీ వంటి పథకాలను అమలు చేశారన్నారు. కార్యక్రమంలో కంభం మండల స్పెషల్‌ ఆఫీసర్‌ సైమన్‌విక్టర్‌, ఎంపీడీవో మస్తాన్‌వలి, తహసీ ల్దార్‌ కిరణ్‌, కార్యదర్శి బ్రహ్మయ్య, ఈవోఆర్‌డీ విజయ లక్ష్మి, సర్పంచ్‌ బోడయ్య, టీడీపీ నాయకులు ఆరేపల్లి మల్లికార్జున్‌, కొత్తపల్లి శ్రీనివాసులు, తోట శ్రీనివాసులు, సయ్యద్‌ అనీస్‌అహమ్మద్‌, దాదా, రమణ, రవికుమార్‌, ఖాదర్‌, హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.

చిన్నగుడిపాడులో మంచి ప్రభుత్వం

పెద్దదోర్నాల : మండలంలోని చిన్నగుడిపాడు గ్రామంలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. తహసీల్దారు శాంతి, గ్రామ టీడీపీ నాయకులు దొడ్డా శేషాద్రి ఆధ్వర్యంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపట్టిన అభివృద్ధి పనులపై ఇంటింటికీ వెళ్లి వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఇళ్లకు స్టిక్కర్లు అంటించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దారు సాలమ్మ, వీఆర్‌వో, గ్రామకార్యదర్శి, టీడీపీ నాయకులు దొడ్డా రాజా బాబు, గుండపనేని వెంటరత్నం, కాకర్ల ధర్మారావు పాల్గొన్నారు.

Updated Date - Sep 21 , 2024 | 01:02 AM