సంతనూతలపాడులో రేషన్‌బియ్యం అక్రమ డంపులు
ABN, Publish Date - Nov 08 , 2024 | 12:44 AM
సంత నూతలపాడులో అక్రమ రేషన్‌బియ్యం డంపులు తరచూ అధికారులకు చిక్కుతున్నాయి. దీంతో రేషన్ బియ్యం మా ఫియా ఏస్థాయిలో పని చేస్తుందో ఎవరికైనా అర్థంకాక మానదు. గత పదేళ్లలో పలుమార్లు అక్రమంగా నిల్వ ఉం చిన రేషన్ బియ్యం పట్టుబడిన సరే.. నిందితులపై 6ఎ కేసులు నమోదు చేసి అధికారులు చేతులు దులుపుకుం టున్నారనే ఆరోపణలు వినపడుతున్నాయి.
గత పదేళ్లలో పలుమార్లు పట్టివేత
ఒకే రైస్‌మిల్లులో దొరుకుతున్నా యంత్రాంగం మౌనం ఎందుకో..
నాగరాజ ట్రేడర్స్‌లో నిల్వల లెక్క తేల్చిన అధికారులు
సంతనూతలపాడు, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): సంత నూతలపాడులో అక్రమ రేషన్‌బియ్యం డంపులు తరచూ అధికారులకు చిక్కుతున్నాయి. దీంతో రేషన్ బియ్యం మా ఫియా ఏస్థాయిలో పని చేస్తుందో ఎవరికైనా అర్థంకాక మానదు. గత పదేళ్లలో పలుమార్లు అక్రమంగా నిల్వ ఉం చిన రేషన్ బియ్యం పట్టుబడిన సరే.. నిందితులపై 6ఎ కేసులు నమోదు చేసి అధికారులు చేతులు దులుపుకుం టున్నారనే ఆరోపణలు వినపడుతున్నాయి. అధికార యం త్రాంగం కూడా తూతూమంత్రంగా చర్యలు తీసుకుంటుం డంతో ఈ దందా నడిపిస్తున్న వారు కూడా ఏముందిలే.. మేనేజ్ చేస్తే సరిపోతుందనే ధోరణి ఉన్నారు.
అర్థరాత్రి దాడులు
సంతనూతలపాడులోని మద్దులూరురోడ్డులో గల నాగ రాజ ట్రేడర్స్ రైస్ మిల్లుపై బుధవారం అర్ధరాత్రి ఆర్డీవో లక్ష్మీప్రసన్న, తహసీల్దార్ వి.ఆదిలక్ష్మి తమ సిబ్బందితో దాడిచేసి పట్టుకున్న సంగతి విదితమే. అయితే ఈ మి ల్లులో మూడు పెద్ద గదుల్లో రేషన్ మాఫియా భారీ ఎత్తు న నిల్వ చేసిన బియ్యాన్ని నిల్వలు, రైసుమిల్లులో ఓపెన్ ప్లేసులో రెండు చోట్ల బియ్యం డంపులు ఉండటాన్ని గు ర్తించారు. అక్రమ రేషన్ బియ్యం లెక్కలు తేల్చేందుకు అ ధికారులు బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం సాయంత్రం 4గంటల వరకు సమయం పట్టింది. మొత్తం 1,624 (50కేజీల బ్యాగు) బస్తాలలో అక్రమరేషన్ బియ్యా న్ని లోడ్ చేయించి చీమకుర్తిలో వెంకటేశ్వర రైస్‌మిల్లులోకి తరలించారు. బయట నుంచి కొనుగోలు చేసి తీసుకొచ్చిన వాహనంలోని 80 రేషన్ బియ్యం బస్తాలను చీమకుర్తి ఎ మ్‌ఎల్‌ఎస్ పాయింట్‌కు తరలించారు. నిందితులు ఎం.రా జేష్‌గుప్తా, ఎం.శ్రీనివాసరావు, పి.చిరంజీవిలపై 6ఎ కింద కేసులు నమోదు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీలు రాజ్య లక్ష్మి, శివరామక్రిష్ణ, ఫుడ్‌ఇన్‌స్పెక్టర్ గుణవంశీ తెలిపారు. పట్టుబడిన రెండు వాహనాలను, బియ్యం ప్యాకింగ్ చేసే యంత్రాన్ని సంతనూతలపాడు ఎస్‌ఐ వి.అజయ్‌బాబుకు అప్పగించారు.
రేషన్ బియ్యానికి డెకరేషన్..
నాగరాజు ట్రేడర్స్ రైస్‌మిల్లులో అక్రమంగా రేషన్ బి య్యం పాలిషింగ్ చేసి అందంగా ఉంటే సంచుల్లో ప్యాకిం గ్ చేస్తున్నారు. బయట కొంతమంది డీలర్ల నుంచి తీసుకొ చ్చిన రేషన్ బస్తాలలో మిల్లులో పాలిషింగ్ చేసి బయట మార్కెట్లో వినియోగించే బ్యాగుల్లో లోడ్ చేసి ప్యాకింగ్ చే సేందుకు ఒక యంత్రాన్నే అందుబాటులో పెట్టుకున్నారు. ఈ బియ్యం బయట మార్కెట్లో రేషన్ బియ్యం కాదనే వి ధంగా డెకరేషన్ చేసి ప్రజలకు విక్రయిస్తున్నారు.
పలుమార్లు పట్టుబడినా...
సంతనూతలపాడులో నాగరాజ ట్రేడర్స్ రైస్‌మిల్లులో పలుమార్ల్లు అక్రమ రేషన్ బియ్యం పట్టుబడిన సంఘట నలు ఉన్నాయి. అయితే ఆ మిల్లును సీజ్ చేయాల్సిన ఉ న్నతాధికారుల మౌనం దేనికో అని పలువురు అనుమాని స్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున రేషన్ మాఫియా వ్యవహా రం దర్జాగా కొనసాగుతుంటే.. ఎవరి అండచూసుకుని మాఫియా నడుస్తోందని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం మాఫియాకు చేరవే స్తున్న కొంతమంది డీలర్లుపై కూడా పూర్తిస్ధాయిలో చర్య లు తీసుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమార్కులపై కఠిన చర్య లు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Updated Date - Nov 08 , 2024 | 12:44 AM