ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

డీసీసీబీలో విచారణ

ABN, Publish Date - Nov 07 , 2024 | 11:20 PM

జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో కలెక్టర్‌ నియమించిన ముగ్గురు అధికారుల కమిటీ విచారణ రెండవ రోజైన గురువారం కూడా కొనసాగింది. కాగా విచారణ సమయంలో అక్కడ కొందరు వివాదాస్పద ఉద్యోగులు ఉండటంపై బ్యాంకు ఉద్యోగ వర్గాల్లో చర్చ సాగుతోంది.

రెండోరోజూ కొనసాగింపు

పలు ఫైళ్లను పరిశీలించిన కమిటీ

ఒంగోలు, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో కలెక్టర్‌ నియమించిన ముగ్గురు అధికారుల కమిటీ విచారణ రెండవ రోజైన గురువారం కూడా కొనసాగింది. కాగా విచారణ సమయంలో అక్కడ కొందరు వివాదాస్పద ఉద్యోగులు ఉండటంపై బ్యాంకు ఉద్యోగ వర్గాల్లో చర్చ సాగుతోంది. బ్యాంకు నిర్వహణలో అవినీతి, అక్రమాల ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రాథమిక విచారణ చేసి నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియాను ఆదేశించిన విషయం విదితమే. తదనుగుణంగా డిప్యూటీ కలెక్టర్‌ లోకేశ్వరరావు నేతృత్వంలో జిల్లా ఆడిట్‌ అధికారి, ఎల్‌డీఎంలతో కూడిన అధికారుల కమిటీని కలెక్టర్‌ నియమించారు. వారు బుధవారం సాయంత్రం బ్యాంకును సందర్శించి అటు ప్రభుత్వానికి ఇటు ప్రత్యేకంగా కలెక్టర్‌కు అందిన ఫిర్యాదులో పేర్కొన్న అంశాలకు సంబంధించిన పైళ్లను తమ ముందు ఉంచాలని సూచించారు. ప్రధానంగా 2019-24 మధ్యకాలంలో జిల్లావ్యాప్తంగా ఎలాంటి ముందస్తు టెండర్లు లేకుండా రూ.కోటితో సీసీ కెమెరాల కొనుగోలు, బ్యాంకు బ్రాంచిలలో ఆధునికీకరణ పనుల పేరుతో లక్షలాది రూపాయలు స్వాహా, నిబంధనలకు విరుద్ధంగా బ్యాంకు సీఈవోకు ప్రత్యేకంగా సలహాదారు నియామకం, లబ్ధిదారుల సంతకాలను ఫోర్జరీ చేసి నిధులను సొంత ఖాతాకు మళ్లించుకొని బ్యాంకు నుంచి డిస్మిస్‌ అయిన ఉద్యోగిని తిరిగి విధుల్లోకి తీసుకోవడమే కాక ప్రస్తుతం బ్యాంకు కేంద్ర కార్యాలయంలో సదరు ఉద్యోగి రింగ్‌ లీడర్‌గా చెలాయిస్తున్న తీరు, మరో డిస్మిస్‌ అయిన ఉద్యోగికి నిబంధనలను పట్టించుకోకుండా పెండింగ్‌ పేరుతో వేతనాలను చెల్లింపునకు అధికారుల కమిటీ ఆమోదం, చీమకుర్తి బ్రాంచిలో సుమారు రూ.1.5కోట్లకుపైగా అక్కడి అధికారి స్వాహా చేయగా ప్రధాన కార్యాలయం నుంచి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వంటి పలు అంశాలపై విచారణ కమిటీ దృష్టి సారించినట్లు సమాచారం. ఆయాఅంశాలకు సంబంధించిన ఫైళ్ల పరిశీలనతో పాటు కొందరు ఉద్యోగులను కూడా విచారణ అధికారుల కమిటీ విచారించినట్లు తెలిసింది.

Updated Date - Nov 07 , 2024 | 11:20 PM