అండర్ పాస్‌లో పోయే ఇళ్ల పరిశీలన
ABN, Publish Date - Nov 02 , 2024 | 11:46 PM
జాతీయ రహదారిలో తిమ్మనపాలెం చెక్ పోస్టు వద్ద నూతనంగా నిర్మిస్తున్న అండర్ పాస్ నిర్మాణంలో కోల్పోయే ఇళ్లను చీరాల ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు మాట్లాడారు. శనివారం మండలంలోని తిమ్మనపాలెం గ్రామానికి వచ్చిన ఆయన కొత్తగా నిర్మించే ప్లైవోవర్, సర్వీస్ రోడ్డు కోసం భూ సేకరణ ప్రాంతాన్ని తహసీల్దార్ జీవీ సుబ్బారెడ్డి, ఇతర అధికారులతో కలిసి ఆర్డీవో పరిశీలించారు.
బాధితుల సమస్యలు తెలుసుకున్న ఆర్డీవో
మేదరమెట్ల, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి) : జాతీయ రహదారిలో తిమ్మనపాలెం చెక్ పోస్టు వద్ద నూతనంగా నిర్మిస్తున్న అండర్ పాస్ నిర్మాణంలో కోల్పోయే ఇళ్లను చీరాల ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు మాట్లాడారు. శనివారం మండలంలోని తిమ్మనపాలెం గ్రామానికి వచ్చిన ఆయన కొత్తగా నిర్మించే ప్లైవోవర్, సర్వీస్ రోడ్డు కోసం భూ సేకరణ ప్రాంతాన్ని తహసీల్దార్ జీవీ సుబ్బారెడ్డి, ఇతర అధికారులతో కలిసి ఆర్డీవో పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ఎస్సీ కాలనీ వాసులు మాట్లాడుతూ 70వ దశకంలో ప్రభుత్వం మాకు ఇచ్చిన ఇంటి స్థలాలలో ఇళ్లు నిర్మించుకుని నివాసముంటున్నామన్నారు. భూముల ధరలు విపరీతంగా పెరిగిన ఈ సమయంలో తమ ఇళ్లను రోడ్డు నిర్మాణం కోసం తీసుకోవడం అన్యాయమన్నారు. చాలా తక్కువ నష్ట పరిహారం ఇచ్చి భూములను స్వాధీనం చేసుకోవడం కూడా న్యాయం కాదన్నారు. తమకు ప్రభుత్వం న్యాయమైన పరిహారం అందించి నివాస యోగ్యమైన స్థలాలను ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కాలనీ సమీపంలో రోడ్డు పక్కనే స్థలాలు కేటాయించాలని ఆర్డీవోకు విన్నవించారు. కాలనీ వాసుల సమస్యలు విన్న ఆర్డీవో మీ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఆర్‌ఐ కృష్ణమోహన్, సర్వేయర్ మహే్‌షబాబు, వీఆర్వో సుధాకర్, స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
Updated Date - Nov 02 , 2024 | 11:46 PM