ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆక్రమిత భూమి పరిశీలన

ABN, Publish Date - Nov 03 , 2024 | 01:17 AM

మండలంలోని చందలూరు కొండ పోరంబోకు భూమిలో ఆక్రమణలను రెవెన్యూ అధికారులు పరిశీలించారు. ‘యథేచ్ఛగా కొండభూమి కబ్జా’ శీర్షికన శనివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనంపై వారు స్పందించారు.

ఆక్రమిత కొండ పోరంబోకు భూమిని పరిశీలిస్తున్న రెవెన్యూ అధికారులు

ఉన్నతాధికారులకు నివేదిక

‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన

దర్శి, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని చందలూరు కొండ పోరంబోకు భూమిలో ఆక్రమణలను రెవెన్యూ అధికారులు పరిశీలించారు. ‘యథేచ్ఛగా కొండభూమి కబ్జా’ శీర్షికన శనివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనంపై వారు స్పందించారు. తహసీల్దార్‌ శ్రావణ్‌కుమార్‌ ఆదేశాల మేరకు ఆర్‌ఐ పరిటాల శ్రీనివాసరావు, వీఆర్వో మీరాబీ, సర్వేయర్‌ సాయి.. ఆక్రమిత కొండభూమిని పరిశీలించారు. గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి సుమారు 50 ఎకరాల భూమిని ఆక్రమించి బోర్లు వేసి దీర్ఘకాలిక పంటలు వేసేందుకు గుంతలు తీసిన విషయం విదితమే. చందలూరు గ్రామస్థులు అడ్డుకొని అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రెవెన్యూ అధికారులు ఆ భూమిని పరిశీలించి ఆక్రమణలను గుర్తించారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపి వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ స్పష్టం చేశారు.

Updated Date - Nov 03 , 2024 | 01:17 AM