ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

భార్యకు బదులు భర్త వైద్యం

ABN, Publish Date - Sep 12 , 2024 | 01:17 AM

ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్‌)లో వైద్యం విడ్డూరంగా మారింది. విధుల్లో ఉండాల్సిన మహిళా డాక్టర్‌ స్థానంలో ఆమె భర్త విధులు నిర్వర్తిస్తున్నారు.

జీజీహెచ్‌లో విచిత్రం

ఒంగోలు(కార్పొరేషన్‌), సెప్టెంబరు 11: ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్‌)లో వైద్యం విడ్డూరంగా మారింది. విధుల్లో ఉండాల్సిన మహిళా డాక్టర్‌ స్థానంలో ఆమె భర్త విధులు నిర్వర్తిస్తున్నారు. పైపెచ్చు వైద్యం కోసం వచ్చిన వారి పట్ల శ్రద్ధ చూపకపోగా, కఠినంగా వ్యవహరించడంపై రోగులు మండిపడుతున్నారు. దీనిపై బుధవారం ప్రజాసంఘాల నాయకులు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ దుర్గాదేవికి ఫిర్యాదు చేశారు. రిమ్స్‌ క్యాజువాలిటీలో మధ్యాహ్నం డ్యూటీ చేయాల్సిన డాక్టర్‌ నజ్మా ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యసేవలు అందిస్తుండగా, ఆమె భర్త డాక్టర్‌ బాషా విధులు నిర్వర్తిస్తున్నారని దుర్గాదేవి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన సూపరింటెండెంట్‌ మహిళా డాక్టర్‌ నజ్మా డ్యూటీని ఆమె భర్త బాషా చేస్తున్న విషయాన్ని గుర్తించానని, ఈ విషయమై చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు.

Updated Date - Sep 12 , 2024 | 01:17 AM

Advertising
Advertising