ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

శీనారెడ్డి అక్రమాలపై విచారణ ప్రారంభం

ABN, Publish Date - Dec 07 , 2024 | 12:21 AM

జిల్లా నీటి యాజమ్యా సంస్థ(డ్వామా) పూర్వ పీడీ కే .శీనారెడ్డి పనిచేసిన కాలంలో జరిగిన అవినీతి, అక్రమాలపై డిప్యూటీ కలెక్టర్‌ లోకేశ్వరరావు నేతృత్వంలో కమిటీ విచారణ ప్రారంభించింది. ఆయనతోపాటు త్రిసభ్య కమిటీ సభ్యుడైన స్టెప్‌ సీఈవో శ్రీమన్నారాయణలు శుక్రవారం డ్వామా కార్యాలయంలో ఈ విచారణను ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వ కాలంలో డ్వామా పీడీగా శీనారెడ్డి 2014-19 మధ్య దాదాపు నాలుగేళ్లు పనిచేశారు. సహకార శాఖకు చెందిన ఆయన డిప్యుటేషన్‌పై అందులో పనిచేశారు.

డ్వామా సిబ్బందిని వివరాలు అడుగుతున్న డిప్యూటీ కలెక్టర్‌ లోకేశ్వరరావు బృందం

ఒంగోలు, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి) : జిల్లా నీటి యాజమ్యా సంస్థ(డ్వామా) పూర్వ పీడీ కే .శీనారెడ్డి పనిచేసిన కాలంలో జరిగిన అవినీతి, అక్రమాలపై డిప్యూటీ కలెక్టర్‌ లోకేశ్వరరావు నేతృత్వంలో కమిటీ విచారణ ప్రారంభించింది. ఆయనతోపాటు త్రిసభ్య కమిటీ సభ్యుడైన స్టెప్‌ సీఈవో శ్రీమన్నారాయణలు శుక్రవారం డ్వామా కార్యాలయంలో ఈ విచారణను ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వ కాలంలో డ్వామా పీడీగా శీనారెడ్డి 2014-19 మధ్య దాదాపు నాలుగేళ్లు పనిచేశారు. సహకార శాఖకు చెందిన ఆయన డిప్యుటేషన్‌పై అందులో పనిచేశారు. జిల్లా వాసి అయిన శీనారెడ్డి నాటి వైసీపీ ప్రభుత్వ పెద్దల అండతో ఇష్టారీతిన వ్యవహరించాడన్న విమర్శలు వచ్చాయి. కాగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డీసీసీబీ మాజీ చైర్మన్‌ ఈదర మోహన్‌ ప్రభుత్వానికి శీనారెడ్డిపై పలు ఫిర్యాదులు చేశారు. దీనిపై విజిలెన్స్‌ విచారణ ఒకవైపు సాగుతుండగా పొదిలికి చెందిన మహిళా న్యాయవాది ఒకరు వేసిన పిటిషన్‌పై లోకాయుక్తా విచారణలో ఉంది. మరోవైపు జిల్లాకు చెందిన మరో నలుగురైదుగురు వివిధ రూపాలలో ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు.

ఫిర్యాదుల వెల్లువ

అలాగే శీనారెడ్డి అక్రమాలపై జిల్లాకు చెందిన మంత్రి స్వామితోపాటు పలువురు ఎమ్మెల్యేలకు ఆలాగే ఫిర్యాదులు వెళ్ళాయి. ఇలా పలు వైపుల నుంచి ప్రభుత్వానికి భారీగా ఫిర్యాదులు చేరడంతో వాటన్నింటిపై సమగ్రంగా విచారణ నిర్వహించి నివేదించాలని కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియాను గ్రామీణాభివృద్ధి ఉన్నతాధికారులు ఆదేశించారు. డిప్యూటీ కలెక్టర్‌ లోకేశ్వరరావు, జిల్లా ఆడిట్‌ అధికారి శంకరనారాయణరెడ్డి, స్టెప్‌ సీఈవో శ్రీమన్నారాయణలను కమిటీగా కలెక్టర్‌ నియమించారు. దీంతో ఆ కమిటీ విచారణ ప్రారంభించింది. లోకేశ్వరరావు, శ్రీమన్నారాయణలు డ్వామా కార్యాలయానికి శుక్రవారం వెళ్లారు. రెవెన్యూ సదస్సులకు చీమకుర్తి మండలానికి స్పెషలాఫీసర్‌ అయిన ప్రస్తుత పీడీ జోస్‌ఫకుమార్‌ చీమకుర్తికి వెళ్లగా డ్వామా కార్యాలయంలోని పలువురు సూపరింటెండెంట్లను పిలిచి విచారణ కమిటీ సభ్యులు మాట్లాడారు. ప్రధానంగా డ్వామా పీడీ శీనారెడ్డి ఎంతకాలం పనిచేశారు, కార్యాలయంలో ఏఏ విభాగాలు ఉన్నాయి, ఆ సంస్థ ద్వారా అమలుచేసే పథకాలు, సంబంధిత విభాగాల పర్యవేక్షకుల వివరాలు సేకరించారు. అలాగే ప్రభుత్వానికి అందిన ఫిర్యాదుల పరిశీలనకు అనుగుణంగా అవసరమైన పైళ్లు ఏ విభాగంలో ఏమేమి అవసరం అన్న అంశాలను వారికి వివరించి వాటిని అందజేయాలని సూచించారు. పైళ్ల పరిశీలనతోపాటు ఫిర్యాదులు ఎదుర్కొంటున్న శీనారెడ్డిని కూడా పిలిచి విచారించనున్నట్లు సమాచారం.

Updated Date - Dec 07 , 2024 | 12:21 AM