సోషల్ సైకోలపై ఉక్కుపాదం
ABN, Publish Date - Nov 10 , 2024 | 02:22 AM
సోషల్ మీడియా వేదికగా వైసీపీ ప్రేరేపిత సైకోలు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్య మంత్రి, ఉపముఖ్యమంత్రులపై చేస్తున్న పోస్టింగులపై పోలీ సులు దృష్టి సారించారు. సామాజిక మాధ్యమాల వేదికగా సైకోలు హద్దులు దాటి శ్రుతిమించుతుండటంతో వారిపై చర్య లకు ఉపక్రమిస్తున్నారు. ఇష్టారీతిన ఎక్స్, ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రాం తదితరాల్లో అనుచితమైన వాఖ్యలను పోస్టింగ్ చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్‌గా ఉన్నారు.
ఇష్టారీతిన పోస్టింగుల ఫలితం
ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్‌పై కేసు
గొంతు నొక్కేందుకే అంటూ ఆయన ఆరోపణలు
మార్కాపురం, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): సోషల్ మీడియా వేదికగా వైసీపీ ప్రేరేపిత సైకోలు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్య మంత్రి, ఉపముఖ్యమంత్రులపై చేస్తున్న పోస్టింగులపై పోలీ సులు దృష్టి సారించారు. సామాజిక మాధ్యమాల వేదికగా సైకోలు హద్దులు దాటి శ్రుతిమించుతుండటంతో వారిపై చర్య లకు ఉపక్రమిస్తున్నారు. ఇష్టారీతిన ఎక్స్, ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రాం తదితరాల్లో అనుచితమైన వాఖ్యలను పోస్టింగ్ చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్‌గా ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడాన్ని సహించలేని వైసీపీలోని సైకో కార్యకర్తలు హద్దులుదాటి పోస్టింగులు పెడుతుండటంపై ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.
కేసులు నమోదుతో పెడబొబ్బలు
ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఎక్స్ వేదికగా రాష్ట్ర మానవ వనరులశాఖ మంత్రి నారా లోకేష్‌పై అనుచిత పోస్టు పెట్టారు. రాష్ట్రంలోని పేకాట క్లబ్‌ల నుంచి వారంవారం కమీషన్లు వసూలు చేస్తున్నట్లు నిరాధారమైన ఆరోపణలు చేశారు. ‘పేకాట ఆడేవారికి వసతులు ఏర్పాటు చేస్తారా..?’ అంటూ మంత్రిని ప్రశ్నించారు. ఈ విషయంపై గత నెలలోనే టీడీపీ కార్యకర్త చేదూరి కిషోర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎర్రగొండపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఎమ్మెల్యే చంద్రశేఖర్ ప్రెస్‌మీట్లు పెట్టి టీడీపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ‘ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కేసేందుకు కేసులు నమోదు చేస్తారా’ అంటూ ఆరోపణలు చేశారు. అయితే ఎలాంటి ఆధారాలు లేకపోయినా రాష్ట్ర మంత్రులపై ఇష్టంవచ్చినట్లు ఆరోపణలు చేయడమేగాక మళ్లీ తాము సుద్దపూసలమంటూ ప్రెస్‌మీట్లు పెట్టడం గమనార్హం. అదేవిధంగా సత్తెనపల్లికి చెందిన కల్లి నాగిరెడ్డి అనే వైసీపీ సైకో కూడా ఇదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌లు విజయవాడ వరద సహాయం మాటున రూ.534 కోట్లు లూటీ చేశారని గత నెలలో ఎక్స్ వేదికగా అనుచిత పోస్టింగు పెట్టారు. దీనిపై మార్కాపురానికి చెందిన టీడీపీ కార్యకర్త యశ్వంత్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. తాడేపల్లిలో దాక్కున్న వైసీపీ సైకోను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెళ్లారు. ఆపార్టీ నాయకులు మళ్లీ ఇష్టారీతిన తమ కార్యకర్తను కిడ్నాప్ చేశారంటూ సామాజిక మాధ్యమాల ద్వారా విషప్రచారం చేశారు. అంతేకాక పొదిలి, కొత్తపట్నం, ఒంగోలు, చీరాల తదితర ప్రాంతాల్లో కూడా సామాజిక మాధ్యమాల్లో వైసీపీ సైకోలు చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఫిర్యాదులు చేస్తే పోలీసులు అరెస్ట్‌లు చేస్తున్నారు. తీరుమార్చుకోకుంటే భవిష్యత్తులో కూడా అరెస్టుల పరంపర కొనసాగుతుందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
విచారణకు పిలిచిన పోలీసులు
రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌పై తీవ్ర పదజాలంతో పోస్టు పెట్టిన ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణకు రావాలంటూ ఆయనకు వారం క్రితం నోటీసు ఇచ్చారు. కానీ ఆయన హాజరుకాలేదు. దీంతో నేరుగా ఎమ్మెల్యేకు శుక్రవారం ఎర్రగొండపాలెం ఎస్సై చౌడయ్య ఫోన్ చేసి శనివారం విచారణకు స్టేషన్‌కు రావాలని కోరారు. చంద్రశేఖర్ హాజరుకాకపోగా తాను డీజీపీని కలుస్తానని మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్పారు. పైగా కేసుల పేరుతో తమ గొంతు నొక్కుతున్నారంటూ గగ్గోలు పెట్టారు.
Updated Date - Nov 10 , 2024 | 02:22 AM