ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తవ్విన కొద్దీ అక్రమాలు

ABN, Publish Date - Nov 15 , 2024 | 12:39 AM

జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ)లో కలెక్టర్‌ ఆదేశాలతో డిప్యూటీ కలెక్టర్‌ లోకేశ్వరరావు నేతృత్వంలో త్రిసభ్య కమిటీ చేపట్టిన విచారణ ఇంకా కొనసాగుతోంది. రెండు, మూడు రోజుల్లో విచారణ పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా త్రిసభ్య కమిటీని ఆదేశించారు.

పీడీసీసీ బ్యాంకులో ఇంకా కొలిక్కి రాని త్రిసభ్య కమిటీ విచారణ

నిత్యం కలెక్టర్‌కు అందుతున్న ఫిర్యాదులు

కొన్ని అంశాలలో కమిటీకి సహకరించని సిబ్బంది

ఒంగోలు, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ)లో కలెక్టర్‌ ఆదేశాలతో డిప్యూటీ కలెక్టర్‌ లోకేశ్వరరావు నేతృత్వంలో త్రిసభ్య కమిటీ చేపట్టిన విచారణ ఇంకా కొనసాగుతోంది. రెండు, మూడు రోజుల్లో విచారణ పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా త్రిసభ్య కమిటీని ఆదేశించారు. తదనుగుణంగా ఈనెల 6న విచారణను వారు ప్రారంభించారు. తొమ్మిది రోజులు గడిచినా ఇంకా వారి విచారణ కొలిక్కి రాలేదు. గురువారం కూడా విచారణ సాగింది. తొలుత కలెక్టర్‌కు అంతకు ముందు ప్రభుత్వానికి అందిన ఫిర్యాదులపై వారు ప్రాథమిక విచారణ చేపట్టారు. అయితే విచారణ జరుగుతుందన్న సమాచారంతో పలువురు మరికొన్ని అంశాలపై ఫిర్యాదు చేశారు. వాటిని కూడా పరిశీలన చేయాలని కలెక్టర్‌ సూచించారు. తాజాగాసోమవారం గ్రీవెన్స్‌లోనూ అనంతరం కలెక్టర్‌కు విడిగాను మరికొందరు బ్యాంకు ఉద్యోగులే తమ ఉద్యోగోన్నతులు ఇతరత్రా అంశాలపై ఫిర్యాదు చేశారు. అలా విచారణ ప్రారంభించాక కూడా భారీగా ఫిర్యాదులు వస్తుండటంతో కలెక్టర్‌ ఆదేశాలతో అధికారుల కమిటీ వాటిని కూడా పరిశీలన చేస్తోంది.


లోతుగా పరిశీలన

తొలుత రెండు, మూడు రోజుల్లో విచారణ పూర్తి చేయాలని అనుకున్నా ప్రస్తుతం తొమ్మిది రోజులైనా ఇంకా కొన్ని పరిశీలన చేయాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా విచారణ కమిటీకి నేతృత్వం వహిస్తున్న డిప్యూటీ కలెక్టర్‌ లోకేశ్వరరావు కలెక్టర్‌ సూచనలతో ఒకింత లోతుగానే పరిశీలన చేస్తున్నట్లు సమాచారం. దీంతో అనేక అవకతవకలు వెలుగు చూస్తున్నాయి. తవ్విన కొద్ది అక్రమాలు బహిర్గతం అన్న చందంగా విచారణ సాగుతున్నట్లు తెలుస్తుండగా విభిన్నవర్గాల లబ్ధిదారులకు ఇచ్చిన రుణాలు ఇతరత్రా అంశాలకు సంబంధించిన సమాచారాన్ని సిబ్బంది విచారణ కమిటీకి ఇవ్వడంలో జాప్యం చేస్తున్నట్లు తెలిసింది. ఇతర పలు పైళ్ల విషయంలోనూ అలాగే వ్యవహరిస్తున్నట్లు సమాచారం. అయితే అన్ని ఫిర్యాదులపైనా సదరు విచారణాధికారి ఒకటికి రెండు, మూడుసార్లు సంబంధిత బ్యాంకు అధికారులను వివరణలను అడగడం, పైళ్లు చూపాలని కోరడంతో చేసేదేమీ లేక అందజేస్తున్నట్లు సమాచారం. ఈక్రమంలో ఇప్పటివరకు పలు అవకతవకలు, అక్రమాలు జరిగాయన్న నిర్ధారణకు కమిటీ చైర్మన్‌ గుర్తించినట్లు తెలిసింది.

నిబంధనలకు విరుద్ధంగా..

ప్రధానంగా కొందరు ఉద్యోగులకు లబ్ధిచేకూరేలా పోస్టింగులు, ఉద్యోగోన్నతులు, అలాగే వివిధ బ్యాంకు బ్రాంచిల ఆధునికీకరణ పేరుతో చేసిన పనులకు, సీసీ కెమెరాల కొనుగోలు, ఇతరత్రా ఆర్థిక లావాదేవీల విషయంలో నిబంధనలకు విరుద్ధంగా కూడా చేసినట్లు వారి విచారణలో గుర్తించినట్లు సమాచారం. ఆయా అంశాలకు సంబంధించిన విచారణలో కొన్ని విషయాలపై స్పష్టత రావాల్సి ఉండటంతో అవి కూడా వచ్చాక ఒకటి, రెండు రోజుల్లో విచారణ పూర్తిచేసి నివేదికను కలెక్టర్‌కు కమిటీ తరఫున డిప్యూటీ కలెక్టర్‌ లోకేశ్వరరావు అందజేస్తారని తెలుస్తోంది. కాగా తొలుత బ్యాంకుపై ఫిర్యాదులపై విచారణ విషయంలో కలెక్టర్‌ను సహకారశాఖ అధికారులు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయగా ప్రస్తుతం కూడా వారితోపాటు బ్యాంకులోని కొందరు ఉద్యోగులు కూడా విచారణాధికారిని తప్పుదోవ పట్టించే అలాగే ఒత్తిడి తెచ్చే చర్యలకు పాల్పడుతున్నట్లు సమాచారం. అయినప్పటికీ విచారణ కమిటీకి నేతృత్వం వహిస్తున్న లోకేశ్వరరావు గట్టిగానే ఫైళ్లు పరిశీలిస్తుండటంతో అక్రమార్కులు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - Nov 15 , 2024 | 12:39 AM