వెంపరాల మేజర్‌లో సాగునీటి కష్టాలు
ABN, Publish Date - Oct 31 , 2024 | 12:09 AM
ఒక వైపు సాగు నీరు అందించే డ్యాంల ద్వారా నీరు సముద్రం పాలు అవుతున్నా సాగులో ఉన్న పంటలకు సకాలంలో నీరు అందడం లేదు. దీంతో పంటలు ఎండుముఖం పడుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. మండల పరిధిలోని వెంపరాల మేజర్ కాలువ ద్వారా ఎస్‌ఎల్ గుడిపాడు, వైదన, కొప్పెరపాడు, గొర్రెపాడు, కూకట్లపల్లి, కొత్తూరు, వెలమవారిపాలెం, వెంపరాల గ్రామాలోని సుమారు 5వేల ఎకరాలకు పైచి లుకు పంటలకు సాగు నీరు అందాల్సి ఉంది. ఈ మేజర్ కింద రైతులు వరి, నల్ల చెరకు పంటలను పెద్ద ఎత్తున సాగు చేశారు. గత పది రో జుల కిందట మేజర్ కాలువ మరమ్మతులతో నీటిని నిలిపివేశారు.
సాగుకు నీరు అందక ఎండి పోతున్న వరి నాట్లు
గ్యాస్‌పైపు లైన్ కోసం రెండ్రోజులుగా సరఫరా నిలిపివేత
ఎండుతున్న పంటలు
ఆందోళనలో రైతులు
బల్లికురవ, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి) : ఒక వైపు సాగు నీరు అందించే డ్యాంల ద్వారా నీరు సముద్రం పాలు అవుతున్నా సాగులో ఉన్న పంటలకు సకాలంలో నీరు అందడం లేదు. దీంతో పంటలు ఎండుముఖం పడుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. మండల పరిధిలోని వెంపరాల మేజర్ కాలువ ద్వారా ఎస్‌ఎల్ గుడిపాడు, వైదన, కొప్పెరపాడు, గొర్రెపాడు, కూకట్లపల్లి, కొత్తూరు, వెలమవారిపాలెం, వెంపరాల గ్రామాలోని సుమారు 5వేల ఎకరాలకు పైచి లుకు పంటలకు సాగు నీరు అందాల్సి ఉంది. ఈ మేజర్ కింద రైతులు వరి, నల్ల చెరకు పంటలను పెద్ద ఎత్తున సాగు చేశారు. గత పది రో జుల కిందట మేజర్ కాలువ మరమ్మతులతో నీటిని నిలిపివేశారు. మరలా రెండు రోజుల నుంచి హైదరాబాద్ కృష్ణపట్నం వరకు ఏర్పాటు చేస్తున్న గ్యాస్ పైపులైన్ పనుల నేపథ్యంలో వెంపరాల మేజర్ కాలువకు నీటిని పూర్తిగా నిలుపుదల చేశారు. వ్యవసాయ సీజన్‌లో మేజర్ కాలువకు నీటిని నిలుపుదల చేయడం ఏమిటని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరి నాట్లు నీరు అందక ఎండుతున్నాయని వారు అవేదన వ్యక్తం చేశారు. అధికారులు గ్యాస్ పైపులైన్ పనులకు నీటిని ఎలా నిలుపుదల చేశారని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ ఏడాది డ్యాంలలో నీరు ఉండి కూడా పంటలు ఎండు ముఖం పట్టాయని వారు తెలిపారు. వెంపరాల మేజర్ కాలువపై పర్యవేక్షణ లేక పోవడం వలనే నీటి కష్టాలు వస్తున్నాయని రైతులు అరోపిస్తున్నారు. వరి నాట్లు ఎండిపోయి భూమి నెర్రెలు వాలడంతో కలుపు అధికమైందని కొందరు రైతులు నాట్లు వేయలేక ఇబ్బంది పడుతున్నారని రైతులు తెలిపారు. అఽధికారులు ఇ ప్పటికైనా స్పందించి వెంపరాల మేజర్ కాలువకు నీటిని విడుదల చేయాలని పలు గ్రామాల రైతులు కోరుతున్నారు.
Updated Date - Oct 31 , 2024 | 12:09 AM