ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కార్తీకమాస పూజలు ప్రారంభం

ABN, Publish Date - Nov 03 , 2024 | 01:32 AM

మార్కాపురం పట్టణంలో కార్తీక మాసం పూజలు శనివారం నుంచి భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి.

మార్కాపురం వన్‌టౌన్‌, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): మార్కాపురం పట్టణంలో కార్తీక మాసం పూజలు శనివారం నుంచి భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జగదాంబసమేత మార్కండేశ్వరస్వామి ఆలయంలో అర్చకులు ఏలూరి ఆంజనేయశర్మ, రెంటచింతల వరుణ్‌తేజ శర్మలు మార్కండేశ్వర స్వామి, జగదాంబ మాతలకు ప్రత్యేక అలంకరణ, అర్చనలు నిర్వహించారు. భక్తులు తెల్లవారుజాము నుంచి స్వామి దర్శనానికి బారులుతీరారు. పూజలు చేసి నాగదేవత లకు పాలు పోసి ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించి నోములు నోచారు. పట్టణంలోని వివిధ ఆలయాలలో కార్తీక దీపాలు వెలిగించారు. మార్కండే శ్వర స్వామి ఆలయంలో ఈఓ ఈదుల చెన్నకేశవరెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు.

గిద్దలూరు : కార్తీకమాస పూజలు పలు దేవాలయా లలో ప్రారంభమయ్యాయి. కార్తీక మాసంలో తొలిరోజు అయిన శనివారం తెల్లవారుజాము నుంచే శివాలయా లకు భక్తులకు పోటెత్తారు. పట్టణంలోని శ్రీపాతాళ నాగేశ్వరస్వామి దేవాలయంలో ముఖ్యంగా మహిళ భక్తులు కార్తీక దీపాలు వెలిగించి శివునికి ప్రత్యేక పూజ లు నిర్వహించారు. శ్రీఅభయాంజనేయస్వామి దేవాల యంలో కార్తీక మాస పూజలు ప్రారంభమయ్యాయి. శ్రీ కుసుమ హరనాథ మందిరంలో నెలరోజులపాటు జరిగే కార్తీక మాస ప్రత్యేక పూజలను మందిరం అధ్యక్షులు నటుకుల శ్రీనివాసులు ప్రారంభించారు. శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానం, షరాఫ్‌ బజారులోని శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో గంగమ్మ, గౌరమ్మల ను ప్రతిష్ఠించారు. నెలరోజులపాటు గంగమ్మ, గౌరమ్మ లకు కుంకుమ పూజలు అనంతరం కార్తీక మాస చివరి రోజు నిమజ్జన కార్యక్రమం చేస్తామని దేవస్థాన కమిటీ ప్రతినిధులు తెలిపారు. కెఎస్‌పల్లి, పలుపులవీడు, పలు గ్రామాలలోని శివాలయాలలో కార్తీకమాస పూజలతో పాటు ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు.

త్రిపురాంతకం : కార్తీకమాస పూజలు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం త్రిపురాంతకేశ్వరస్వామి ఆలయంలో శనివారం వైభవంగా నిర్వహించారు. ఈసందర్బంగా స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, రుద్రహోమం పూజలను వైభవంగా నిర్వహించారు. ఈసందర్బంగా పలువురు భక్తులు అయ్యప్ప మాల ధరించారు. ఆలయ ప్రధానార్యకులు విశ్వన్నారాయణశాస్త్రి సాయంత్రం సమయంలో ప్రత్యేక పూజల అనంతరం రాత్రికి కార్తీకదీపాన్ని వెలిగించి ఆకాశదీపం ఏర్పాటు చేశారు. కార్తీక మాసం సందర్బంగా భక్తులకు స్వామివారి ఆలయం వద్ద అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

కోలాహలంగా అయ్యప్ప దీక్షల స్వీకరణ

పొదిలి: అయ్యప్పస్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీకమాసం ప్రారంభం కావడంతో శనివారం స్థానిక అయ్యప్ప దేవాలయంలో భక్తులు కోలాహలంగా దీక్షలు స్వీకరించారు. శనివారం తెల్లవారుజామునుండే భక్తులు మాల వేసుకొని దీక్ష తీసుకొనేందుకు బారులు తీరారు. శనివారం 105 మంది దీక్ష తీసుకున్నట్లు పూజారి మురళీస్వామి తెలిపారు. ఇప్పటి వరకు 600లకుపైగా భక్తులు దీక్ష తీసుకు న్నారన్నారు. అదే విధంగా పార్వతీసమేత నిర్మామహేశ్వరస్వామి దేవాలయంలో కార్తీకమాసం ప్రారంభం రోజున మహిళలు దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ కట్టారు.

Updated Date - Nov 03 , 2024 | 01:32 AM