Leopard: ప్రకాశం జిల్లాలో రెండోరోజు కొనసాగుతున్న చిరుతపులి రెస్క్యూ ఆపరేషన్
ABN, Publish Date - Jun 27 , 2024 | 09:57 AM
ప్రకాశం జిల్లా: గిద్దలూరు మండలం, దేవనగరం సమీపంలో చిరుతపులి రెస్క్యూ ఆపరేషన్ రెండోరోజు కొనసాగుతోంది. పాత పేపర్ మిల్లు సమీపంలో ఉన్న గుంతలో నిన్న చిరుతపులి పడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు, వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
ప్రకాశం జిల్లా: గిద్దలూరు మండలం, దేవనగరం సమీపంలో చిరుతపులి (Leopard) రెస్క్యూ ఆపరేషన్ (Rescue operation) రెండోరోజు (Second day) కొనసాగుతోంది. పాత పేపర్ మిల్లు సమీపంలో ఉన్న గుంతలో నిన్న చిరుతపులి పడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు, వెంటనే అటవీశాఖ అధికారులకు (Forest Officials) సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు నిన్న రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. చిరుతను బయటకు తీసుకువచ్చేందుకు అన్ని విధాలుగా ప్రయత్నించారు. అయితే చీకటిపడడంతో రెస్క్యూ ఆపరేషన్ నిలిపివేశారు. గురువారం ఉదయం మళ్లీ అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. చిరుతపులిని రక్షించి దానిని అడవిలో విడిచిపెట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
కాగా ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలోని దేవనగరం గ్రామ సమీపంలో బుధవారం సాయంత్రం చిరుతపులి సంచారం భయాందోళనలు రేకెత్తించింది. ప్రజలు దాన్ని చూసి హడలిపోయారు. అయితే చిరుతపులి అకస్మాత్తుగా గ్రామ సమీపంలోని ఓ గుంతలో పడిపోయింది. దీంతో స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అయితే చీకటి పడడంతో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించేందుకు అటవీశాఖ సిబ్బందికి ఇబ్బందులు ఎదురయ్యాయి. రాత్రివేళ దానిని బయటకు తీయకుండా గుంతలో నుంచి బయటకు వెళ్లకుండా వలతో కట్టుదిట్టంగా కంచె ఏర్పాటు చేశారు. చిరుతపులిని రక్షించి అడవిలో విడిచి పెట్టేందుకు వీలుగా తిరుపతి నుంచి గురువారం ఉదయం ప్రత్యేక రెస్క్యూ టీంను తీసుకొస్తున్నట్లు స్థానిక అటవీశాఖ అధికారులు తెలిపారు. మొత్తం మీద చిరుత గుంతలో పడడంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. రెండు రోజులక్రితం గిద్దలూరు-నంద్యాల మధ్యలోని నంద్యాల అటవీ ప్రాంతంలో వంటచెరకు తెచ్చుకొనేందుకు పచ్చర్ల సమీపంలో అడవిలోకి వెళ్లిన మహిళపై చిరుత దాడి చేసి చంపిన విషయం విదితమే. గుంతలో చిక్కుకున్నది ఆ చిరుతేనా? అన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
సుప్రీం కోర్టుకు వెళ్దాం: కేసీఆర్
డిజిటల్ కార్పొరేషన్ పేరుతో జగన్ భారీ మాయ..
బీఆర్‌ఎస్‌కు తలనొప్పిగా మారిన ఎమ్మెల్యే
రేవంత్‌రెడ్డి కేబినెట్‌లో కొత్త మంత్రులు వీరే..?
ఆ మంత్రికి గైడ్ చేస్తున్నది ఎవరు?
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jun 27 , 2024 | 10:26 AM