ఎల్‌ఐసీ పరిరక్షణకు చలో పార్లమెంట్
ABN, Publish Date - Nov 13 , 2024 | 12:49 AM
ప్రజల సంస్థ ఎల్‌ఐసీని పరిరక్షించుకునేందుకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న చలో పార్లమెంట్ కా ర్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎల్‌ఐసీ ఏజెంట్స్ ఆర్గనై జేషన్ ఆఫ్ ఇండియా ఆల్ ఇండియా(ఎల్‌ఐసీఏవో ఐ) వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్.మంజునాథ్ తెలిపారు.
ఎల్‌ఐసీఏవోఐ వర్కింగ్ ప్రెసిడెంట్ మంజునాథ్
ఒంగోలు కలెక్టరేట్, నవంబరు 12 (ఆంధ్రజ్యో తి): ప్రజల సంస్థ ఎల్‌ఐసీని పరిరక్షించుకునేందుకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న చలో పార్లమెంట్ కా ర్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎల్‌ఐసీ ఏజెంట్స్ ఆర్గనై జేషన్ ఆఫ్ ఇండియా ఆల్ ఇండియా(ఎల్‌ఐసీఏవో ఐ) వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్.మంజునాథ్ తెలిపారు. ఎల్‌ఐసీఏవోఐ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం మంగళవా రం స్థానిక రెడ్‌క్రాస్ భవనంలో జరిగింది. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, ఐఆర్టీఏ ప్రతిపాదించిన నూతన విధానాల వల్ల ఏ జెంట్ల కమిషన్ పెంచకపోగా తగ్గించారన్నారు. పా లసీలపై ప్రీమియం, కనీస బీమాను పెంచడం, వ యోపరిమితిని కుదించడం వల్ల ఇన్సూరెన్స్ తీసుకు నే వారి సంఖ్య తగ్గిపోయే అవకాశం ఉందని చె ప్పారు. ఎల్‌ఐసీని ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసి కార్పొ రేట్లకు కట్టబెట్టే ప్రయత్నాలు కనిపిస్తున్నాయని ఆరోపించారు. ఈ చర్యలను యూనియన్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. జోనల్ ప్రధానకార్యదర్శి పీఎల్. నరసింహారావు మాట్లాడుతూ ఐఆర్డీఏఐ, కేంద్ర ప్ర భుత్వ చర్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా దశల వారీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈనెల 10 నుంచి డిసెంబరు 10వ తేదీ వరకు డివిజనల్ ఆఫీసు వద్ద ధర్నాలు, డిసెంబరు 20నుంచి ఏజెంట్లు, ఖాతాదారులు, ప్రజల వద్ద నుంచి కోటి సంతకాల సేకరణ, దేశంలోని అన్ని పా ర్లమెంట్ నియోజకవర్గాల ఎంపీలకు వినతిపత్రాలు అందజేయడం జరుగుతుందన్నారు. ఫిబ్రవరి 11న చలో పార్లమెంట్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వివరించారు. ఈ ఆందోళన కార్యక్రమాల్లో ఏజెంట్లు అందరూ పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.రవికిషోర్, రాష్ట్ర వర్కింగ్ ప్రె సిడెంట్ కె.రాజశేఖర్, రాష్ట్ర కోశాధికారి పి.శ్రీనివాస రావు, నెల్లూరు డివిజన్ అధ్యక్షుడు బెజవాడ శివ య్య, ప్రధానకార్యదర్శి సీహెచ్.నరసింహారావు, వర్కి ంగ్ ప్రెసిడెంట్ బి.వెంకట్రావు, కోశాధికారి జి.ధనుం జయ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Nov 13 , 2024 | 12:49 AM